శివారు ప్రాంతాల మంచి నీటి వసతి కి రు. రూ.1200 కోట్లు -మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లాలోని శివారు పట్టణాల తాగు నీటి అవసరాలు తీర్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రూ.1200 కోట్లు మంజూరు చేసినట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం జల్‌ ‌పల్లి మున్సిపాలిటీ 27 వ వార్డులో రూ.7 కోట్ల 40 లక్షల రూపాయలతో నిర్మించే 60 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్‌ ‌రిజర్వాయర్‌, ‌పైప్‌ ‌లైన్‌ ‌నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గములో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి రూ.207 కోట్లు మంజూరు అయ్యాయని, వాటిలో జలపల్లి మునిసిపాలిటీకి రూ.72 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

వరద నీరు సాఫీగా వెళ్లటానికి నాళాల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయింపు చేయగా, జల్‌ ‌పల్లి మునిసిపాలిటీకి రూ.10 కోట్లు కేటాయించి, పనులు ప్రారంభం చేసినట్లు పేర్కొన్నారు. పేదలదరికే వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు జల్‌ ‌పల్లి మునిసిపాలిటీకి 4 బస్తీ దవాఖానాలు మంజూరు చేసినట్లు తెలిపారు. నూతన బస్తీ దవాఖానలను మునిసిపాలిటీ పరిధిలోని పహాడి షరీఫ్‌, ‌కొత్తపేట, శ్రీరామ్‌ ‌కాలనీ, షాహీన్‌ ‌నగర్‌ ‌లలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.బస్తీ దవాఖానలో వాక్సిన్‌ ‌తో పాటు, అన్ని రకాల వైద్య సేవలు లిబిస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో 288 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బడ్జెట్‌ ‌లో ప్రతిపాదించినట్లు గుర్తు చేశారు.

వాటితో పాటు పల్లె దవాఖానాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యంతో పాటు విద్యకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌ప్రారంభించిన మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్నారు. ప్రయివేట్‌, ‌కార్పొరేట్‌ ‌కు ధీటుగా, అంతకుమించిన నూతన హంగులు సమకూరుస్తూ బడుల రూపురేఖలు మార్చటానికి చేపట్టిన బృహత్తర కార్యక్రమం మన ఊరు మన బడి కార్యక్రమము అన్నారు.తెలంగాణా విద్యార్థి ప్రపంచంతో పోటీ పడేలా, దేశ, విదేశాల్లో ఎక్కడకు వెళ్లిన రాణించేలా ప్రభుత్వ బడుల్లో వచ్చే విద్య సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జల్‌ ‌పల్లి మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌జి పి. కుమార్‌, ‌చైర్మన్‌ అబ్దుల సాది, వైస్‌ ‌చైర్మన్‌, ‌కౌన్సిలర్లు, కోఆప్షన్‌ ‌సభ్యులు, పార్టీ నాయకులు, వాటర్‌ ‌వర్కస్, ‌రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు, టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page