ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: వినియోగదారులకు నాణ్యమైన పదార్థాలను అందించి వారి మన్నన లను పొంది ,వ్యాపారంలో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కాప్రా లోని మహేష్ నగర్, రాధికా సమీపంలో ఏర్పాటు తాజా రెస్టారెంట్ , టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తో కలసి ప్రారంబించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన పదార్థాలను అందించి వారి మన్ననలను పొంది వ్యాపారంలో బాగా రాణించాలని తెలిపారు. ఎమ్మెల్యేగా విజయానతరం మొదటిసారిగా రెస్టారెంట్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్యంరాజ్ కుమార్,యదిగిరి రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి,పిర్జాది గూడ కార్పొరేటర్ రవీందర్, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, కుమార స్వామీ, మహేష్ నగర్ కాలని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాసం వెంకటహరి,తునికి మహిపాల్ రెడ్డి,నర్సింగ రావు, రెడ్డి జే ఏ సి నాయకులు పైళ్ళ హరినాథ్ రెడ్డి,మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి
