Take a fresh look at your lifestyle.

వ్యవసాయ సంక్షేమంలో అగ్రగామిగా తెలంగాణ

  • ధాన్యం కొనుగోళ్లలో దక్షిణ భారతంలో మొదటి స్థానంలో..దేశంలో రెండవ స్థానంలో
  • తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 6.71 మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు
హైదరాబాద్‌, ‌మార్చి 28 : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిరంతర శ్రమ మేథోమధనం, దార్శనికత, దూరదృష్టితో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం వల్ల తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ధాన్యం కోనుగోలులో అద్భుతమైన ప్రగతిని సాధించింది. గత ఏడాది ధాన్యం కొనుగోళ్లలో దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో నిలవగా దేశంలో పంజాబ్‌ ‌తరువాత రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014-15 నుండి 2022-23 (వానాకాలం) వరకు ఒక లక్ష 21 వేల కోట్ల రూపాయల విలువ చేసే 6.71 కోట్ల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అతి తక్కువ సమయంలో దేశంలో ఈ విధంగా ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. వ్యవసాయమే సాధ్యం కాదన్నచోట ఏడాదిలో కోటి టన్నులకు పైగా ధాన్యం పండి•చి చూపిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో రైతులు పండి•చిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్ధతు ధరకు కొనుగోలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతులకు అడుగడునా అండగా నిలుస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తరువాత పరిస్థితిని గమనిస్తే ధాన్యం కొనుగోళ్లలో సాధించిన పురోగతి కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో 24.29 లక్షల మెట్రిక్‌ ‌టన్నులు కొనుగోలు చేయగా 2021-22 నాటికి కోటి 20 లక్షల మెట్రిక్‌ ‌టన్నులకు చేరుకుంది. ఈ ఏడాది వానాకాలంలో 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా 11.69 లక్షల రైతుల నుంచి 13 వేల కోట్ల విలువ చేసే 65 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి కానుంది. దాదాపు రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలలో వరి పంట సాగైంది. మిల్లర్ల కొనుగోలు రాష్ట్ర అవసరాలకు పోగా 90 నుంచి కోటి టన్నుల వరకు కొనుగోలు చేయడానికి పౌర సరఫరాల శాఖ సమయత్తం అవుతుంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలను దేశంలోనే మొట్ట మొదటి సారిగా సహాయ పునరావాస చర్యలు ఎకరానికి రూ.10 వేలు అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నిర్ణయించారు.

image.png
రైతు బంధు : రైతు బంధు పథకం ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే నగదు సాయాన్ని అందిస్తూ రైతులకు నిజమైన సాధికారత సాధించి పెడుతున్న పథకం . ఎకరానికి ఏటా రెండు విడతలలో రూ. 10 వేల పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో 65,000 కోట్లు జమ చేసింది.రైతు బీమా : రాష్ట్రంలోని ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా. 100 శాతం బీమా సొమ్ము చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యం గా పనిచేస్తూ 97913 రైతు కుటుంబాలకు సహాయం అందించింది.ఉచిత విద్యుత్‌ : అన్ని రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు అందిస్తున్నది.

వ్యవసాయ రంగానికి 41.25 శాతం విద్యుత్‌ను అందిస్తున్నది. దాదాపు 25 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది.మిషన్‌ ‌కాకతీయ : రాష్ట్రంలోని 46351 చెరువులు, కుంటలు, చిన్న నీటి వనరుల పునరుద్దరించడం ద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం : అతి తక్కువ సమయంలో పూర్తి చేసి 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నది. రాష్ట్రంలో సాగు భూమి విస్తీర్ణం 119 శాతం పెరుగుదల జరిగింది.

– కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్‌ ‌వారిచే జారీ చేయనైనది

Leave a Reply