వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ

గోధుమల ఎగుమతి నిషేధం పెద్ద తప్పిదం

ప్రంపచానికి అన్నం పెట్టేస్థాయిలో రాష్ట్రం

తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శం

పుష్కలంగా వనరులున్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం

రైతులు ఆలోచించి పంటలను సాగు చేయాలి

రైతులకు ఎదురు ప్రోత్సాహకం ఇస్తున్న సిఎం కెసిఆర్‌

‌వ్యవసాయ సన్నాహక సభలో మంత్రి నిరంజన్‌ ‌‌రెడ్డి

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఇజ్రాయిల్‌ ‌లాంటి చిన్న దేశం వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తుంటే.. మనం చేసే చిన్న తప్పులతోనే భారీ మూల్యం చెల్లించుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు. మన దగ్గర అన్ని పంటలు పండుతున్నాయని, వనరులు పుష్కలంగా ఉన్నా.. అవగాహనా లోపం, నిర్లక్ష్యతో రైతులు వెనుకపడుతున్నారన్నారు. వరంగల్‌లో జరిగిన వానకాల పంటల సాగు సన్నాహక సభలో మంత్రి మాట్లాడుతూ అవకాశాలను అందిపుచ్చుకుని సకాలంలో పంటలు వేయాలని అన్నారు. ప్రధాని మోదీ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నారన్నారు. వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుంది. వ్యవసాయం బాగుండాలి. అన్నదాతలను గౌరవించాలని మంత్రి అన్నారు. ఏ పంట వేస్తే లాభం జరుగుతుందో ఆలోచించి సాగు చేయాలని రైతులకు సూచించారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. వర్షాలను సీఎం కేసీఆర్‌ ఆపుతారా అన్నారు. సకాలంలో వరిపంట వేసుకుంటే అకాల వర్షాలతో నష్టాలు వొచ్చేవి కావన్నారు. నవంబర్‌లోనే సాగు ప్రారంభించిన రైతులు ఏప్రిల్‌లోనే వరికోతలు పూర్తి చేసుకున్నారన్నారు. దీంతో ఎలాంటి నష్టంలేకుండా రైతులు లాభాలు పొందారని తెలిపారు. ఎప్పుడైనా మే నెలలో అకాల వర్షాలు పడుతుంటాయని.. రాళ్ల వానలతో పంట నష్టం జరుగుతుందన్నారు. ఈదురుగాలులతో వొచ్చే వర్షాలతో మామిడి తోటలు దెబ్బతింటాయన్నారు.

కొంతమంది రైతులు నిర్లక్ష్యంగా పంటలు వేయడంతో అకాల వర్షాలకు నష్టాలపాలవుతున్నారన్న మంత్రి .. వర్షాలను ఏమైనా సీఎం కేసీఆర్‌ ‌చేయిపెట్టి ఆపగలరా అన్నారు. రాళ్లవానను ఆపగలరా.. ఈదురుగాలులతో వొచ్చే వర్షాన్ని సీఎం కేసీఆర్‌ ఆపగలరా అని చెప్పుకొచ్చారు. 15 రోజులు ముందు వరిపంట వేస్కుంటే ఎలాంటి నష్టం ఉండదని.. లాభాలతో తెలంగాణ వ్యవసాయం ప్రపంచానికి చాటిచెప్పవచ్చన్నారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు విషయంలో రైతులను చైతన్యం చేయడంలో విజయవంతం అయ్యామని.. ఉద్యాన, కాయగూరల్లో విభిన్న పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలన్నారు. అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్న తోతాపురి, మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, అరటి సాగు వైపు ఉద్యానశాఖ రైతులను ప్రోత్సహించాలని అన్నారు. వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుందన్న నిరంజన్‌ ‌రెడ్డి.. వ్యవసాయం బాగుపడి అన్నదాతల గౌరవించాలన్నారు. రైతు వేదికలలో నిరంతరం రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆయన.. ఆధునిక వ్యవసాయం, ఎరువులు, పురుగుమందుల యాజమాన్య పద్ధతులు వంటి వాటిపై చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం ఆరుతడి పంటలు వేసుకోమంటే కొందరు తప్పుదోవ పట్టించారని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు. ప్రపంచంలో వ్యవసాయ రంగానికి నీటి ప్రాముఖ్యతను చాటిన నేల ఓరుగల్లు అని నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. 11వ శతాబ్దంలోనే గొలుసుకట్టు చెరువులు, కుంటలు, ప్రముఖ ఆలయాలను కాకతీయ రాజులు నిర్మించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కాకతీయుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ ‌మిషన్‌ ‌కాకతీయ పథకాన్ని రూపొందించారని గుర్తు చేశారు. ప్రపంచంలోని ఆధునిక ప్రాజెక్టులకు భిన్నంగా పారే నీళ్లు ఎదురెక్కేలా సీఎం కేసీఆర్‌ ‌ప్రపంచంలో అతి పెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు. రైతుకు రైతుబంధు పథకం ద్వారా ఎదురు పెట్టుబడి ఇస్తూ..సీఎం అన్నదాతలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఏది పండించాలి ? ఏది పండించకూడదు? అని తెలుసుకుని సాగు చేస్తే అది లాభసాటి వ్యవసాయం అవుతుందన్నారు. 5 శాతం మాత్రమే జీవరాశి జీవించగలిగే ఈజిప్ట్‌లో కోటి ఎకరాలలో భూమి మాత్రమే సాగవుతుంది. అక్కడ ప్రభుత్వమే ఏ పంటలు పండించాలో రైతులకు నిర్దేశిస్తుంది.ఆ ప్రకారమే వారు పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. మన దేశంలో గోధుమల ఎగుమతిని ప్రధాని మోదీ నిలిపివేశారు.

చిన్న, చిన్న దేశాలు ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తుంటే .. దాదాపు 40 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్న మన దేశం ఎగుమతులను నిషేధించడం గమనార్హం అన్నారు. ఈ పరిస్థితిని రైతులకు తెలియజెప్పి చైతన్యం చేయాలని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. రైతు వేదికలలో నిరంతరం రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఆధునిక వ్యవసాయం, ఎరువులు, పురుగుమందుల యాజమాన్య పద్ధతులు వంటి వాటిపై చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు విషయంలో రైతులను చైతన్యం చేయడంలో విజయవంతం అయ్యాం. ఉద్యాన, కాయగూరల్లో విభిన్న పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని అన్నారు. వరంగల్‌ ‌కోడెం ఫంక్షన్‌ ‌హాల్‌లో నిర్వహించిన వరంగల్‌, ‌మహబూబాబాద్‌, ‌జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సుకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, సత్యవతి రాథోడ్‌, ‌రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ ‌రావు, ఎంపీలు కవిత, దయాకర్‌, ఎమ్మెల్యేలు సుదర్శన్‌ ‌రెడ్డి, శంకర్‌ ‌నాయక్‌, ‌వెంకటరమణ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్‌ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్‌ ‌ముదిరాజ్‌, ‌జడ్పీ చైర్మన్‌ ‌గండ్ర జ్యోతి, మేయర్‌ ‌గుండు సుధారాణి, కలెక్టర్లు గోపి, శశాంక్‌, ‌భవేష్‌ ‌మిశ్రా, ఉద్యానశాఖ డైరెక్టర్‌ ‌వెంకట్రామ్‌ ‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page