వోటు గుద్దితే..

నదులన్ని కలిసి సముద్రములో ఎలా కలుస్తాయో
వివిధ పార్టీల నాయకులు నేడు ‘అవినీతి అనే సముద్రములో’ కలుస్తున్నారు ఓకేచోట
అక్కడ ఉప్పునీరు త్రాగడానికి పనికిరాదు
ఇక్కడ నాయకులు ప్రజలకు పనికి రారు
ఆవులు-ఆవులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు విరిగినట్లే
కొట్లాటలు పెట్టే నాయకులు బాగానే ఉంటున్నారు
తెల్లారితే బావా..అన్నా…
కానీ కాళ్ళు విరగ్గొట్టుకునే దూడలే అమాయక ప్రజలు
వాళ్లకు(నాయకులకు)ఈ పార్టీ కాకుంటే ఆపార్టీ
బిచ్చగాడికి ఓ ఇల్లు కాకుంటే మరో ఇల్లు అన్నట్లు
కానీ కార్యకర్తలకు మాత్రం ఒకటే ఇల్లు
అదే ‘నమ్ముకున్న పార్టీ’
కానీ నాయకులు మాత్రము అమ్ముకుంటున్నారు ప్రజల నమ్మకాన్ని
బయటికి మాత్రం
నువ్వెంతా నీ బతుకెంత?
లోన మాత్రం నీకెంత కమీషన్‌
మరి నాకెంత?
ఇజ్జతి అనే పదాన్నీ వీళ్ళు ఇప్పుడో కాశీలో ఒదిలారు
మిగిలింది చీము నెత్తురు లేని
మనిషి ముద్ద..
ఓ వోటరూ జర జాగ్రత్త
వోటు గుద్దితే (మీట నొక్కితే)
గువ్వ గుయ్యి అనాలే
మైండు బ్లాకు కావాలె..
దారం సోమేశ్వర్‌, హనుమకొండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *