న్యూ దిల్లీ, జులై 25 ః విపక్ష పార్టీలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భాష్యం చెప్పారు. కూటమిని ఆయన తీవ్రంగా విమర్శించారు. విపక్ష పార్టీలు దిశానిర్దేశర లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్ ముజాహిద్దిన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపించారు.
ఇంతగా దిశలేని విపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని ప్రధాని మోదీ ఇవాళ జరిగిన బీజేపీ భేటీలో పేర్కొన్నారని సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి పార్టీలను కూడా విదేశీయులు ప్రారంభించినట్లు ప్రధాని మోదీ విమర్శించారు. దేశం పేరును వాడుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించలేరని ప్రధాని ఆరోపించారన్నారు. ఓడిపోయి, అలసిపోయి, ఆశలేని పార్టీలుగా విపక్షాలు మిగిలిపోయినట్లు ప్రధాని పేర్కొన్నారు.



