విద్యా సౌధం….క్రీడా సౌరభం

 క్రీడా ప్రాంగణం.. బాలికల విద్యా సముదాయం..
– మంత్రి హరీష్‌ ‌రావు కృషి తో మోడల్‌ ‌గా సిద్దిపేట ప్రభుత్వ  బాలికల కళాశాల, పాఠశాల..
– రూ.3కోట్ల సీఎస్‌ ఆర్‌ ‌నిధులతో కొత్త రూపురేఖలు..
– అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్‌  ‌రన్నింగ్‌, ‌వాకింగ్‌ ‌ట్రాక్‌..
– ‌వివిధ క్రీడలకు..క్రీడాకారులకు నెలవు కానున్న బాలికల కళాశాల…
– నిత్యం అథ్లెటిక్‌  (‌రన్నింగ్‌ ) ‌పై ఆసక్తి ఉన్న వారికి కానుక ఇవ్వనున్న మంత్రి హరీష్‌ ‌రావు
– మంత్రి హరీష్‌ ‌రావు పర్యవేక్షణ లో  ముమ్మరంగా సాగుతున్న పనులు

 సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాల ఇక పాత గర్లస్ ‌కాలేజ్‌..‌గర్సల్ ‌హైస్కూల్‌ ఇక కొత్త ప్రభుత్వ బాలికల విద్యా సముదాయం..క్రీడా సౌరభం గా మారనుంది.. మంత్రి హరీష్‌ ‌రావు  ప్రత్యేక కృషి చొరవ తో విద్యాలయం రూపురేఖలు మారనున్నాయి.. రూ.3కోట్ల సి ఎస్‌ ఆర్‌ ‌నిధులతో సిద్దిపేట ప్రభుత్వ బాలికల కళాశాల, పాఠశాల మోడల్‌ ‌గా తీర్చిదిద్దనున్నారు.
 ఆధునిక విద్యాలయం..క్రీడా ప్రాంగణం..
విద్యార్థులకు చదువు తో పాటు క్రీడలు ఉంటే వారికి మానసికొల్లాసం..శారీరక దృడత్వం సొంతం అవుతుంది.. మంత్రి హరీష్‌ ‌రావు  బాలికలకు  మంచి విద్యా బోధన తో పాటు సదుపాయాలు కల్పన పై దృష్టి సారించారు..ఒక వైపు విద్యా , మరో వైపు క్రీడా సదుపాయాలు కల్పిస్తూ అద్భుతమైన నిర్మాణాలు చేపడుతున్నారు..రూ. 3కోట్ల తో బాలికల ప్రాథమిక , ఉన్నత  పాఠశాలలు, జూనియర్‌ ‌కళాశాల లో ఆధునిక నిర్మాణాలు , క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.. నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయ్‌..‌మంత్రి హరీష్‌ ‌రావు నిత్యం పర్యవేక్షణ చేస్తూ పలు సూచనలు చేస్తూ పనులను చక చక చూపిస్తున్నారు వచ్చే కొద్దీ రోజుల్లోనే విద్యా సంవత్సరం ఆరంభం లోనే అందుబాటులోకి రానుంది… ఆహ్లాదకరమైన పార్కు,  క్రీడా సౌరభం.. విద్యా సౌధం ఉట్టిపడేలా ద్వారం ఉండేలా ప్రణాళికబద్దంగా నిర్మాణాలు చెపడుతున్నారు…
 వివిద ఆటలకు నెలవు కానున్న క్రీడా వేదిక బాలికల విద్యా సముదాయం..
సిద్దిపేట బాలికల జూనియర్‌ ‌కళాశాల తో పాటు ప్రాథమిక , ఉన్నత పాఠశాలకు ఒకే   మైదానం ఉండగా ఇప్పుడు హైస్కూల్‌ ‌కు అద్భుతమైన క్రీడా ప్రాంగణం సెపరేట్‌ ‌కానుంది.. జూనియర్‌ ‌కళాశాల ప్రాంగణంలో    అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐదు వరుసల అథ్లెటిక్‌ ‌రన్నింగ్‌ ‌ట్రాక్‌ ‌సింథటిక్‌ ‌టర్ఫ్ ‌తో ఏర్పాటు కానుంది… అదేవిధంగా వివిధ క్రీడలు వాలి బాల్‌, ‌ఫుట్‌ ‌బాల్‌ ఆటలు ఆడేందుకు వీలుగా రన్నింగ్‌ ‌ట్రాక్‌ ‌మధ్యలో గ్రీన్‌ ‌టర్ఫ్ ‌తో అద్భుతమైన మైదానాన్ని ఏర్పాటు చేయనున్నారు.. ట్రాక్‌ ‌చుట్టు సిట్టింగ్‌ ‌గ్యాలరీ ఏర్పాటు చేస్తూ చుక్క నీరు నిల్వకుండ చర్యలు చేపడుతున్నారు… రాష్ట్రంలో నే ఈ పాఠశాల క్రీడా మైదానం మోడల్‌ ‌గా నిల్వనుంది… రన్నింగ్‌ ‌వారియార్స్ ‌కి మంత్రి హరీష్‌ ‌రావు కానుక..
నిత్యం రన్నింగ్‌ ‌చేయాలి అనే తపన, రన్నింగ్‌ ‌మానసికొల్లసం కు ఎంతో మంచిది అనే వారు ఏంతో మంది ఉంటారు.. మంత్రి హరీష్‌ ‌రావు  అథ్లెటిక్‌ ‌రన్నింగ్‌ ‌పై ఆసక్తి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్‌ ‌కళాశాల లో ఐదు వరుసల సింథటిక్‌  ‌రన్నింగ్‌  ‌ట్రాక్‌ ఏర్పాటు చేసి కానుకగా ఇవ్వనున్నారు.. ఇప్పటికే పనులు ముమ్మరంగా సాగుతూ తుది దశకు చేరుకున్నాయి… వచ్చే కొద్దీ రోజల్లోనే రన్నింగ్‌ ‌ట్రాక్‌ అం‌దుబాటులోకి రానుంది..
 మారనున్న రూపురేఖలు..
మంత్రి హరీష్‌ ‌రావు  కృషి తో సిద్దిపేట బాలికల పాఠశాల , జూనియర్‌ ‌కళాశాల రూపురేఖలు ఒక్క సారిగ మారునున్నాయి.. ఒక వైపు విద్యా సమూహం..మరో వైపు క్రీడా సముదాయం గా వెలుగొందునుంది.. ఒకప్పుడు విద్యా , సదుపాయాలు , క్రీడలు నామమాత్ర సౌకర్యాలు ఉండే నేడు అద్భుతమైన సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి.. స్కూల్‌ ‌ప్రాంగణం అంత పచ్చదనం తో ద్విగుణీకృతం కానుంది..అధునాతన పరికరాలు కార్పోరేట్‌ ‌స్ధాయి విద్యా బోధన కు వేదిక కానుంది.పాఠశాల ఆవరణంలో మోడల్‌ ‌కిచెన్‌, ‌బోజనశాల , మోడల్‌ ‌టాయిలెట్స్ , అదనపు తరగతులు ,సమావేశాలకు చక్కటి వేదిక ఇలా ఎన్నో అధునాతన హంగులతో విద్యార్థులు లు చదువు, క్రీడా రెండు విద్యార్థుల కు అందిచాలనే లక్ష్యం తో మంత్రి హరీష్‌ ‌రావు కృషి కి గొప్ప నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page