విద్యార్థుల నిరసనపై ప్రభుత్వ తీరు గర్హనీయం

» మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ సోనియాగాంధీ
» వైఫల్యాలను ఏకరవు పెడుతూ ప్రకటన విడుదల

న్యూదిల్లీ, జూలై 24: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోని యా గాంధీ సంచలన ఆ రోపణలు చేశారు. విద్యా వ్యవస్థలో చోటు చేసు కుంటున్న పరిణామాలు, విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ము ఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడాన్ని ప్ర శ్నించారు. ఈ మేరకు సోనియాగాంధీ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యా వ్యవస్థలో తీవ్రమైన వైఫల్యాలు వెలుగులోకి వచ్చిన ప్పటికీ సదరు కేంద్ర మంత్రి బాధ్యత వ హించకుండా పదవిలో ఇంకా కొనసాగు తున్నారని సోనియా గాంధీ ధ్వజమెత్తారు. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా 152 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ప్రస్తావించారు. జాతీయ పరీక్షల నిర్వహణ వ్యవస్థలో లో పాలపై మోదీ ప్రభుత్వం వెంటనే సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణను ఉంచడం వల్లే ఈ పరీక్షల విశ్వసనీయత దెబ్బతిందని ఆరోపిం చారు. పరీక్షా వ్యవస్థలో పారద ర్శకత, బా ధ్యతాయుతమైన విధానాలు అవసరమని పేర్కొన్నారు. విద్యార్థుల నిర సనలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా సోనియా గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. శాంతియుతం గా నిరసన వ్యక్తం చేస్తున్న యువతను దేశ భవిష్యత్తుగా చూడాల్సిందిపోయి దేశద్రో హులుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. జులై 20వ తేదీన విద్యార్థుల పై టియర్ గ్యాస్ ప్రయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలోనే జరిగిందని ఆరోపించారు. అలాగే మోదీ హయాంలో పాఠశాల విద్యకు 50 శాతం, ఉన్నత విద్యకు 33 శాతం మేర బడెట్ తగ్గించారని సోనియా గాంధీ దుయ్యబ ట్టారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయా ల్సిన సమయంలో మోదీ సర్కార్ నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తోందని సోనియాగాంధీ ఆగ్రహించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *