Take a fresh look at your lifestyle.

విదేశీ వర్సిటీలకు యూజిసి అనుమతి తప్పనిసరి

న్యూదిల్లీ, జనవరి5 : విదేశీ యూనివర్సిటీలు ఒకవేళ ఇండియాలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలనుకుంటే, అప్పుడు ఆ వర్సిటీలు కచ్చితంగా యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్యానల్‌ ‌చైర్మెన్‌ ఎం ‌జగదీశ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. విదేశీ వర్సిటీలకు తొలుత పదేళ్ల కోసం ప్రాథమిక అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.

క్యాంపస్‌లను ఏర్పాటు చేసే విదేశీ వర్సిటీలు ఫుల్‌ ‌టైమ్‌ ‌కోర్సులకు శిక్షణా తరగతులను భౌతికంగా నిర్వహించాల్సి ఉంటుందని, ఆన్‌లైన్‌ ‌లేదా డిస్టాన్స్ ‌లెర్నింగ్‌ ‌విధానం ఉండదన్నారు. అయితే ఆ వర్సిటీలు తమకు నచ్చిన రీతిలో అడ్మిషన్‌, ‌ఫీజు విధానాన్ని రూపొందించు కోవచ్చు అన్నారు. విదేశీ వర్సిటీలకు చెందిన ముసాయిదా మార్గదర్శకాలను రిలీజ్‌ ‌చేసినట్లు జగదీశ్‌ ‌వెల్లడించారు. ఫెమా చట్టం ప్రకారం వర్సిటీలకు నిధుల మళ్లింపు ఉంటుందన్నారు.

Leave a Reply