హైదరాబాద్, పిఐబి, మార్చి 29 : వారాణసీలో 644 కోట్ల రూపాయల ఖర్చుతో 3.85 కిమీ పొడవైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రోప్ వే నిర్మాణాన్ని చేపట్టడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వారాణసీలో 644 కోట్ల రూపాయల ఖర్చుతో 3.85 కిమీ పొడవైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రోప్ వే నిర్మాణ పనులు జరుగుతున్నాయంటూ రహదారి, రవాణా మరియు రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్ కరీ వెల్లడించిన ట్వీట్‌ను ప్రధాన మంత్రి షేర్ చేస్తూ -‘‘విశ్వాసం మరియు సాంకేతిక విజ్ఞానం యొక్క అద్భుతమైన మిశ్రణం.
వారాణసీలో రూపు దిద్దుకొంటున్నటువంటి ఈ రోప్ వే తో భక్త జనులకు యాత్రానుభవం మరింత ఉత్తేజకరంగా మారడంతో పాటు మరింత స్మరణీయంగా కూడా ఉంటుంది. దీని ద్వారా బాబా విశ్వనాథ్‌ను దర్శించుకోవడంలో వారికి చాలా సౌకర్యవంతంగా కూడాను ఉంటుంది.’’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.