వడ్ల రాజకీయం వెనుక మహాకుట్ర

  • బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్‌ ‌కుమ్కక్కు
  • తక్కువ ధరలకే రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి
  • కెసిఆర్‌ ‌కుట్రలపై పోరాడుదాం..రండి
  • రైతులకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బహిరంగ లేఖ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 9 : ‌టీఆర్‌ఎస్‌ ‌వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర జరుగుతుందని, బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్‌ ‌కుమ్కక్కయ్యారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌ ఆరోపించారు. భారీ ఎత్తున కవి•షన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్‌ అని, రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా ప్లాన్‌ అని విమర్శించారు. అన్నదాతాలారా…కేసీఆర్‌ ‌కుట్రలను ఛేదిద్దాం రండని అంటూ ఆయన పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కేసీఆర్‌ ‌మెడలు వంచుదాం రండి..

అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌రైతులకు బహిరంగ లేఖ రాశారు. యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసివేయడం వెనుక మహాకుట్ర దాగి ఉందని, పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో పనిలేకుండా తక్కువ ధరకే బ్రోకర్లకు అమ్ముకునేలా రైతులకు అనివార్య పరిస్థితులు సృష్టించి పెద్ద ఎత్తున లబ్ది పొందాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పథకం రచించారని ఆయన ఆరోపించారు.

బ్రోకర్ల మాఫియాతో కలిసి పెద్ద స్కెచ్‌ ‌వేశారని, దీనివెనుక వందల కోట్ల రూపాయలు కవిషన్ల పేరిట ప్రభుత్వ పెద్దలకు ముట్టబోతున్నాయని, యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం అందులో భాగమేనని, అయితే రైతులు పంట ఎందుకు కొనడం లేదని నిలదీసే అవకాశం ఉన్నందున ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది బద్నాం చేయడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు పేరిట డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వడ్ల పేరుతో మరోసారి ’తెలంగాణ సెంటిమెంట్‌’ ‌ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని కేసీఆర్‌ ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేస్తున్న డ్రామాలను తెలంగాణ రైతాంగం గమనించాలన్నారు.

మంచి చేస్తాడని వోట్లేస్తే లేని సమస్యను సృష్టించి రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ ‌కు, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రైతు సోదరులారా?. న్యాయ నిర్ణేతలు వి•రే?.ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్‌ ‌మెడలు వంచేందుకు బీజేపీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నానని ఆయన లేఖను విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page