న్యూ దిల్లీ, జనవరి 27 : దిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైంది. రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తుపై జస్టిస్ నాగ్ పాల్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. తమ నానమ్మ అంత్యక్రియలు, కర్మకాండలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 25న సాయంత్రం శరత్ చంద్రారెడ్డి నానమ్మ చనిపోయారు.
శరత్ చంద్రారెడ్డి నానమ్మ అంత్యక్రియలు, కర్మకాండలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెండు వారాల బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. శరత్ తండ్రి విదేశాల్లో ఉండడంతో నానమ్మ దగ్గరే శరత్ పెరిగాడని, ఆమె చివరి కోరిక మేరకు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరత్ చంద్రారెడ్డికి అనుమతి ఇస్తూ బెయిల్ ఇవ్వాలని కోరారు. విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు.. శరత్ చంద్రారెడ్డికి 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.