- వడ్లు కొనుగోలు చేసేవరకు ఉద్యమం ఆగదు
- సిరిసిల్ల ధర్నాలో కేంద్రంపై మండిపడ్డ మంత్రి కెటిఆర్
తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని నోరు పారేసుకున్న గోయల్‌కు ఎంత బలుపు, కండకావరం అని మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం రైతులను వంచిస్తున్నదని కేటీఆర్ విరుచుకుపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం నిర్లక్ష్య పూరిత వైఖరిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ..చాయ్ పే చర్చ అని అధికారంలోకి వొచ్చిన బీజేపీని తరిమికొట్టడం ఖాయమని తేల్చిచెప్పారు. బీజేపీ పార్టీకి చెందిన గల్లీ నాయకులు ఒక మాట, ఢిల్లీ నాయకులు ఒక మాట మాట్లాడి రైతుల్లో అయోమయాన్ని సృష్టించారు. ధాన్యం సేకరణ విషయంలో ఎవరిది తెలివి తక్కువతనం.. కేంద్రానిదా? తెలంగాణ రైతులదా? అని కేటీఆర్ నిలదీశారు.
బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టడం ఖాయమన్నారు. నూకలు తినమని చెప్పిన పార్టీకి తోకలు కత్తిరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు. ఎండకాలంలో మనం పండించే వరి పంటను కొనాలని అడిగితే.. కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. బియ్యం తినమని పీయూష్ గోయల్ అంటున్నాడు. నూకలు తినడం నేర్పించండని వెటకారంగా మాట్లాడిండు. మంత్రులను కేం పనిలేదా అని అవమానపరిచిండు. ఉప్పుడు బియ్యానికి గిరాకీ లేదని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నడు. సంవత్సరానికి కోటి మెట్రిక్ టన్నుల పైచిలుకు ఉప్పుడు బియ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా 80 నుంచి 90 దేశాలకు కేంద్రం ఎగుమతి చేస్తున్నది. కానీ పీయూష్ గోయల్ సిగ్గు, లజ్జ లేకుండా అబద్దాలు చెబుతూ.. ఉప్పుడు బియ్యం కొనడం లేదని చెప్తుండు.
విద్వేషాన్ని రెచ్చగొట్టేలా కేంద్రమంత్రి మాట్లాడుతుండు. యాసంగిలో వరి సాగు చేయమని రైతులను బండి సంజయ్ రెచ్చగొట్టాడు.. కేంద్రాన్ని ఒప్పించి ప్రతి గింజను కొంటామని చెప్పిండు. కానీ ఇప్పుడేమో ముఖం చాటేశాడు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి కూడా అబద్దాలు చెప్పాడు. రా రైస్, బాయిల్డ్ రైస్‌ను కేంద్రతో కొనిపిస్తామని కిషన్ రెడ్డి చెప్పాడు..ఆయన కూడా పత్తా లేడని కేటీఆర్ దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధాని కాకముందు చాలా మాటలు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. తనను ప్రధాని చేస్తే జీవితాలను మార్చేస్తనని మోదీ చెప్పాడు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నాడు. పేదలందరికీ పెద్దపీట వేస్తానని నమ్మబలికాడు. చాయ్ పే చర్చ అని చెప్పి.. ప్రజలను మోసం చేసిండు.
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ధాన్యం సేకరణపై, పెరిగిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలపై చర్చ జరుగు తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్లలో సిలిండర్ ధరలు పెరిగిపోయాయి. సిలిండర్ వెయ్యి అయింది.. మళ్లీ క్టటెల పొయ్యి దిక్కైంది అని కేటీఆర్ విమర్శించారు. మోదీ పాలనలో సామాన్యుల జీవన స్థితిగతులు మారలేదు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని మోదీ నాడు డిమాండ్ చేశారు. ఎనిమి దేండ్ల కిందట క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్లు మాత్రమే. ఈరోజు కూడా క్రూడాయిల్ ధర అంతే ఉంది. కానీ ఆ రోజు పెట్రోల్ ధర రూ. 70.51 పైసలు, డీజిల్ ధర రూ. 53.78 పైసలు ఉండే. కానీ ఈరోజు ముడి చమురు ధర మారలేదు.
కానీ పెట్రోల్ ధర రూ. 120కి, డీజిల్ ధర రూ. 104కు చేరుకుంది. ఇది ఎవరి చేతకాని తనమో ఆలోచించాలి. సామాన్య ప్రజల నడ్డి విరుగుతున్నా.. మోదీకి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్రజలను నమ్మించి, మోసం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమలో ఎమ్మెల్యే చెన్నమనేని ర