- వారి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు
- రాష్ట్రంలో ధాన్యం సేకరణపై రాహుల్ గాంధీ ట్వీట్
- ఎంఎల్‌సి కవిత కౌంటర్ ట్వీట్‌పై రేవంత్ కౌంటర్
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 29 : రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణను రెండు ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ..రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. మంగళవారం తెలుగులో తన ట్వీట్ ద్వారా రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ధాన్యం సేకరణలో భాజపా, తెరాస ప్రభుత్వాల వైఖరి సిగ్గుచేటని వెల్లడించారు. అన్నం పెట్టే రైతన్నను ఇబ్బంది పెట్టడం ఆపి..వారి వద్ద నుంచి ప్రతి ధాన్యం గింజా కొనాలని డిమాండ్ చేశారు.
ధాన్యం పూర్తిగా కొనేవరకు తెలంగాణ రైతుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ ట్వీట్‌పై విమర్శలు గుప్పిస్తూ ఎంఎల్‌సి కవిత చేసిన కౌంటర్ ట్వీట్‌పై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సెటైర్ విసిరారు. టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని, సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని వితండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. వితండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని వి•రు మర్చిపోయారని అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మరోపక్క రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిలదీస్తూ నిరసనలకు పిలుపు ఇచ్చింది.