బాధ్యులైన పోలీసులపై కేసులు పెట్టాలి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : వరంగల్ జిల్లాలో రైతులపై పోలీసుల చర్య అమానుషమని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. దొంగల్లా గోడదూకి కిడ్నాప్ చేస్తారా అని ప్రశ్నించారు. సీఐ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎస్సై భరత్‌పై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ల్యాండ్‌పూలింగ్ పేరుతో భూముల స్వాధీనాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఎన్‌కౌంటర్ చేస్తానని రైతులను పోలీసులు బెదిరించారని బండి సంజయ్ చెప్పారు.