- వరివేస్తే ఉరి అనడం సమంజసం కాదు
- బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్
రాష్ట్ర రైతులను కాపాడాల్సిన సిఎం కెసిఆర్ వారు వరివేస్తే ఉరే అని అనడం ఎంతవరకు సబబని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నారు కదా,,ఇప్పుడేమయ్యిందని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్: జిల్లాలో కిసాన్ మోర్చా రైతు సదస్సులో మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలా వంద తప్పులు చేసిందని విమర్శించారు. కేసీఆర్ తప్పులు చేస్తూ రైతులను వెంటాడుతున్నారని చెప్పారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ చెప్పడం భావ్యమా అని ఆయన ప్రశ్నించారు. నోరు లేని రైతులను మోసం చేయవద్దన్నారు.
ఎన్ని చేసినా తెలంగాణ గడ్డపై ఎగిరేది బీజేపీ జెండానే అని స్పష్టం చేశారు. ఎవరి జోలికీ వెళ్లని గవర్నర్‌తో కొట్లాట పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, తెలంగాణ సాధన ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు వెళ్లానన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగ వంద తప్పులు చేసిందని, ప్రజలు టీఆర్‌ఎస్‌ను శిక్షించి తనను గెలిపించారని, 101వ తప్పుకు కూడా ప్రజలు శిక్షిస్తారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బుకు, సంపదకు కాపలాదారులు మాత్రమేనని, ప్రధాని నరేంద్ర మోడీ హూందాగా తన కర్తవ్యమని చెబుతారని, కేసీఆర్ నేనిచ్చానని చెప్పుతారన్నారు.
గజ్వేల్‌లోని ఆయన సొంత భూములు అమ్మి ఇస్తున్నారా? అని ఈటల ప్రశ్నించారు. ఒక సందర్భంలో కేసీఆర్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని తమకు చెప్పారని, ఒక రాష్ట్రంలో ఒక అవసరం ఉంటుందని, వ్యవసాయమే గ్రావి•ణ ఆర్థిక జీవనమని, కంప్యూటర్ యుగంలో అన్నం పెట్టేది భూతల్లి మాత్రమేనని, అలాంటి వ్యవస్థను కాపాడాల్సింది పోయి వరి వేస్తే ఉరి అని స్వయానా సీఎం కేసీఆర్ చెప్పడం భావ్యమా అంటూ ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలకు ప్రజల తరఫున కొట్లాడే బాధ్యత ఉంటుందని, ప్రజలు అధికారం ఇస్తే కుర్చీపై నుండి వెలకిలపడి ధర్నాలు చేస్తున్నారని, ప్రజల సమ్యలు పరిష్కరించకపోతే కుర్చీపై కూర్చునే అధికారం లేదని ఆయన వ్యాఖ్యానించారు.