కెసిఆర్‌పై మండిపడ్డ వైఎస్ షర్మిల
రైతుల కోసం కొట్లాడుతున్నానన్న సీఎం కేసీఆర్ కేంద్రం వద్ద ఎందుకు సంతకం పెట్టాడని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. రైతు సంక్షేమమే ముఖ్యమైతే ఆరోజు సంతకం పెట్టకుండా ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ రైతు వేదిక వద్ద ధర్నాలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్లు ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ ఎదురుపడకుండా దాక్కున్నాడు. ఆనాడు సంతకం పెట్టి రైతులను బావిలో తోసి నిండా ముంచిన కేసీఆర్.. ఈ రోజు ఢిల్లీలో రక్షించండంటూ డ్రామాలు ఆడుతున్నాడు.
ఖమ్మం జిల్లా మంత్రి ఎవరి ద.. ఎందుకోసం ధర్నా చేస్తున్నారు? పరిపాలన చేతకాక, వడ్లు కొనడం చేతకాక టిఆర్‌ఎస్పార్టీ ధర్నాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకుంది ప్రజల సమస్యలు పరిష్కరించాలని కానీ ధర్నాలు చేయడానికి కాదు. రైతు పండించిన పంట ఎందుకు కొనడం లేదని.. ధర్నాలు చేస్తే కేసీఆర్ ద చేయాలి. తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి పక్షాలు లేవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పడిందని పేర్కొన్నారు.