రైతులకు రైతుబంధు రాకుండా అడ్డుకున్నది హరీష్ రావే
కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు కందుకూరు మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి ఆరోపణ
కందుకూరు ప్రజాతంత్ర నవంబర్ 27 : రైతులకు రైతుబంధు రాకుండా అడ్డుకున్నది మంత్రి హరీష్ రావే అని కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు కందుకూరు మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి ఆరోపించారు.సోమవారం కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏనుగు జంగారెడ్డి మాట్లాడుతూ,బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసము చేసే ధోరణితోఎన్నికల వేల రైతు బంధు ఇస్తామని అవి సాధ్యం కానీ హామీలు ఇస్తూ,బూటకపు మాటలు మాట్లాడుతున్నారాని ఆయన ఆరోపించారు.ఇన్ని రోజులు ఇవ్వని రైతుబంధు ఇపుడు ఇవ్వాలని తొందర పెట్టి రైతు బందు ఇవ్వడం కోసం ఎన్నికల కమిషన్ కి దరఖాస్తు పెట్టినపుడు,ఎలక్షన్ కమిషన్ రైతుబంధు గురించి ఏలాంటి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయకూడదని చెప్పినా కూడా హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో ఆవాక్యలను పరిగణలోకి తీసుకుంటూ ఈసి రైతు బంధు పథకాన్ని నిలిపివేసిందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకి 15 వేలు మరియు కౌలు రైతులకు 15 వేలు మరియు వ్యవసాయ కూలీలు 12 వేలు ఇస్తామని తమ మ్యానిపెస్టొల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వారి ఖాతాల్లో జమ చేస్తామని,రైతులు ఆందోళనలు చెండవద్దని ఆయన రైతులకు తెలియ చెప్పారు.మామ,అల్లుడు,కొడుకు వారి కుటుంబం ఎన్ని జిమిక్కులు చెసినా తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.