రైతులకు కోసం వరంగల్‌ ‌డిక్లరేషన్‌

  • ఏం ‌చేయబోతున్నామో ప్రకటించనున్న రాహుల్‌
  • ‌కెసిఆర్‌ ‌తీరువల్ల రైతులకు తీవ్రనష్టాలు
  • వి•డియా సమావేశంలో ఎంపి కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 3 : రైతులకు ఏమి చేయబోతున్నామనేది వరంగల్‌ ‌సభలో రాహుల్‌గాంధీ ప్రకటిస్తారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఓయూకి రాహుల్‌గాంధీ వచ్చి విద్యార్థులతో మాట్లాడుతారని స్పష్టం చేశారు. ఆయనను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. భువనగిరి  గెస్ట్ ‌హౌస్‌లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తెరాస ప్రభుత్వ పతనానికి వరంగల్‌లో నిర్వహించే రాహుల్‌ ‌సభ నాందీ పలుకుతుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఏడాదిలోపే ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. రైతుల తలరాతలు మార్చేలా రూపొందించిన డిక్లరేషన్‌ ‌సహా… ప్రభుత్వం వస్తే చేపట్టే కార్యక్రమాలను రాహుల్‌గాంధీ ప్రకటిస్తారని చెప్పారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం లో రాహుల్‌గాంధీ పర్యటిస్తారన్న కోమటిరెడ్డి.. ఆయనను అడ్డుకునే హక్కు ఎవరికి లేదని తేల్చిచెప్పారు. వరంగల్‌ ‌సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భువనగిరిలోని గెస్ట్ ‌హౌస్‌లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.  తెలంగాణ ఉద్యమం పుట్టిందే వరంగల్‌ ‌గడ్డవి•ద. రైతు వ్యతిరేక ప్రభుత్వమే లక్ష్యంగా రాహుల్‌ ‌గాంధీ సభ. రైతులకు మేం ఏం చేయబోతున్నామో సభలో వివరిస్తాం. పండించిన పంటను దొడ్డు బియ్యం కొనమని చెప్పి కేంద్రానికి లేఖరాసిన ముఖ్యమంత్రి వరి వేసుకుంటే ఉరి అని చెప్పిండు.

కేంద్రంపై పోరాడుతానని పది రోజులు దిల్లీకి వెళ్లిండు. అన్ని ధరలు పెరిగిన సమయంలో తక్కువ ధరకే రైతులు అమ్ముకున్నారు. ఎకరానికి 25 వేల పెట్టుబడి అయింది. ఇప్పటివరకు 20 శాతం కూడా కొనుగోళ్లు పూర్తి కాలేదు. రైతుల తలరాతలు మార్చేలా వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ఉం‌టుందని అన్నారు.  రైతులు ముఖ్యమా నీకు సెక్రటరియేట్‌ ‌ముఖ్యమా అని కోమటిరెడ్డి అన్నారు. వరి వేస్తే ఉరి అన్నారని.. కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లి ధర్నాలు చేశారని ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్‌ను కూల్చి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. నాలుగు కోట్ల ప్రజలు బాగుండాలని ఏర్పడిన తెలంగాణలో నిధులు, నీళ్లు లేవన్నారు. రైతు బంధు కౌలు రైతులకు లేకేపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడాది లోపే ఎన్నికలు వస్తాయని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రంజాన్‌ ‌సందర్భంగా భువనగిరి ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *