కీసర, ప్రజాతంత్ర , డిసెంబర్ 06 : తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పా రామారావు, యూత్ అధ్యక్షుడు సుమేష్ లు బుధవారం ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వం కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని వారు శాలువాతో ఘనంగా సన్మానించి, పూలబోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పాలన అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇక ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు
