ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీని కడ్తాల పట్టణ వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు పిప్పల వెంకటేష్ సభ్యుల అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి బాటలో నడుస్తూ జెడ్పీటీసీ గేలుపు నుండి టీసిసిసి ముఖ్యమంత్రి వరకు ఆయన వెంట ఉన్నారన్నారు. రేవంత్ మిత్రమండలి ద్వారా తెలంగాణలో బీద ప్రజలకు తోచిన సహాయం అందించారన్నారు. ఆసిఫ్ అలీతో పాటు కడ్తాల్ మిత్రమండలి సభ్యులు కూడా పార్టీ కోసం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తమ వంతు కృషి చేయడం జరిగిందన్నారు. ఆసిఫ్ అలీకి ఒక బోర్డులో ఉన్నత పదవి వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉరే వెంకటేష్, రాజేందర్ యాదవ్, యాదయ్య, శ్రీను, గంప శేఖర్, మహేష్ చారి, గౌస్, మాధారం మహేష్, కుకుట్ల శ్రీను, రాజేష్, శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ అలీనీ సన్మానించిన వర్తక సంఘం నాయకులు
