- ఏర్పాట్లపై జిల్లాల అధికారులతో విద్యాశాఖ మంత్రి సబిత సమీక్ష
- ప్రశాంతంగా పరీక్షలు రాయండని విద్యార్థులకు మంత్రి సూచన
- ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు చూడాలని విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రేపు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న ఎగ్జామ్స్‌పై ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులతో సోమవారం సవి•క్షా సమావేశం నిర్వహించారు. అన్ని వసతులు కల్పించాలని..పరీక్ష సమయం కంటే ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సబిత సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని..అందుకు తగ్గట్టుగానే పరీక్షా కేంద్రాల్లో మంచినీళ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా.. అర గంట ముందుగానూ పరీక్ష కేంద్రానికి చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. దీని వల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చని పిల్లలకు సూచించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు, భద్రతపై దృష్టి సారించాలని ఆదేశించారు.
స్టూడెంట్స్ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆయా పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు.. ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని.. స్టూడెంట్స్ వినియోగించుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలు సమర్థవంతమైన రీతిలో, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.
ప్రశాంతంగా పరీక్షలు రాయండి…ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు చూడాలి : ఇంటర్ పరీక్షలపై మంత్రి సబిత
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి వారిలో మనోధైర్యాన్ని నింపాలని కోరారు.
పరీక్షలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బంది ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు బాధ్యతతో వ్యవహరించి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ పరీక్షలకు 9 లక్షల 47 వేల 699 మంది విద్యార్థులు హాజరవబోతున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల్లోని ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలర్ల ద్వారా వారికి మోటివేషన్ ఇప్పించి పరీక్షలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.