- పగుల గొట్టారన్న ఫోన్లతో హాజరు
- ఇంటి నుంచి బయలుదేరే ముందు వి•డియాకు ప్రదర్శన
- విచారణకు సహకరించేందుకు సిద్ధమంటూ ఈడికి లేఖ
న్యూ దిల్లీ, మార్చి 21 : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ వరుసగా రెండోరోజూ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఆమె ఈడీ ఆఫీసుకి చేరుకోగా ఆమె వెంట భర్తతోపాటు..ఇతర బీఆర్‌ఎస్ నేతలు వెంట వొచ్చారు. ఈడీ ఆఫీసులోకి అధికారులు మాత్రం ఒక్కరినే అనుమతించారు. మొత్తంగా కవిత ఈడి ముందు విచారణకు హాజరుకావటం ఇది మూడో సారి. సోమవారం 10 గంటలకు పైగా ఆమెను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం మళ్లీ హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే కవిత రెండో రోజు మంగళవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. మరోవైపు ఈడీ ఆఫీస్ దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కాగా రెండోరోజు విచారణలో కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది.
ఈ క్రమంలోనే ఆమె తన వెంట గతంలో ఉపయోగించిన ఫోన్లను కూడా ఈడీ ఆఫీసుకు తీసుకురావటం విశేషం. ఈడీ విచారణకు హాజరుకావటానికి.. దిల్లీ తుగ్లక్ రోడ్డులోని ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట ఉన్న వి•డియాకు రెండు కవర్లలో ఉన్న ఫోన్ల చూపించారు. అయితే కవిత ఫోన్లు పగలగొట్టారని..చాలా ఫోన్లు ఉపయోగించారనే ఆరోపణలు వొచ్చాయి. 10 ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలు రావటంతో.. వాటికి సంబంధించి తన దగ్గర ఉన్న ఫోన్లను చూపించినట్లు తెలుస్తుంది. రెండు కవర్లలోని నాలుగు, ఐదు ఫోన్లను తనతోపాటు ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లారు కవిత. ఆమెతోపాటు లాయర్లు కూడా వెంట ఉన్నారు. ఈడీ అధికారులకు తాను ఉపయోగించిన ఫోన్లను సమర్పించనున్నట్లు తెలుస్తుంది. విచారణకు హాజరయ్యే ముందు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్‌కు ఆమె లేఖ రాశారు.
విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఆ లేఖలో ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇప్పటివరకు తాను ఉపయోగించిన మొబైల్ ఫోన్లను ఈడీకి సమర్పిస్తానని పేర్కొన్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించి కవిత ఈ నెల 11న తొలిసారి దిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమెను తిరిగి ఈ నెల 16న మరోసారి రావాలని ఈడీ ఆదేశించింది. ఈడీ నోటీసులకు సంబంధించి తాను సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేశానని, అది ఈ నెల 24న విచారణకు రానున్నదని, సుప్రీమ్ కోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటానని ఆమె ఈడీకి తన ప్రతినిధి ద్వారా చెప్పారు. అదే సమయంలో ఈడీ అడిగిన అన్ని పత్రాలను సమర్పించారు. అనంతరం సోమవారం ఆమెను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులివ్వడంతో హాజరయ్యారు. విచారణ అనంతరం ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను తిరిగి మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించారు.