నోటికి తాళం వేసుకో
నిత్యసత్యాలను
కంధరం లో దాచుకో
ఆకలి వేస్తున్న
దాహం వేస్తున్న
కడుపులో పైత్యరసం
మంటలు రేపు తున్న
నోరు మెదపకు
ఆకలి తో కడుపు మాడ్చుకో
చూడలేనివి భరించలేనివి
కర్కశ రూపాలు
కదను తొక్కుతున్న
కంతలు కట్టిన గుర్రం లా ఉండిపో
బలమైన బాహుల్ని ముడ్చుకుని
జీ హుజూర్ అంటు కూర్చో తాబేలు లా
చీకటి పులి దెబ్బలు దరువుల్లా పడుతున్న
భరించు బందీవై ఉండిపో…
నీవు అసమర్థుడవు
నీవు పిరికి వాడివి
నీవు ప్రజా ద్రోహివి
అన్నా భరించు
కుక్కిన పేనులా ఉండిపో…
నీలోని అపార శక్తి
నీలోని అపార మేధ
నీలోని త్యాగశీలత
నీలోని మానవతా స్ఫూర్తి
వెలిగించాలి కదా
పరుగులు పెటించాలి కదా
వెలుగులు పంచాలి రా
చీకటి గుహనుండి పులిలా రా
యుద్ధ వీరుడి లా
విప్లవ యోధుడి లా
నదికి గతిశక్తి స్థితిశక్తి ఉన్నట్లు
నీలోను ఉంది రా
బహుజన కేతన మై
బడుగుల లోకం కోసం రా…
అరాచక కీచక పాలన
మనుష్యులను తెగలు గా మతాలు గా
విభజించి పాలించె పాలనపై
పాదం నుండి మస్తకం దాక
నిండామునిగిన తీవ్రవాదంపై
ఖననం చేసిన శవాల పై
భవనాలు నిర్మించె దుర్నీతి పై
ఓ సమసమాజ సమూహం లోకి రా
ఓ మానవ విలువల సమూహం లోకి రా
రావాలి అడుగుల్లో అడుగు కలుపుతూ
రావాలి చేతన తేవాలి
బుద్ధగీతం ఆలపించాలి
రేడియమ్
9291527757