Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ఏడాది పాలన వైఫల్యాలపై బుక్‌లెట్‌ – ఆర్టీసీ ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించాలి : టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌డిమాండ్‌‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రెండోసారి అధికారం లోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ప్రజలకు మేలు చేసే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేక పోయిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్‌ ‌పాలనలో అప్పులకుప్పగా మార్చి వేశారని ప్రస్తురాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు అతి తక్కువ నిధులు కేటాయిస్తున్న కారణంగా ఈ రంగాలలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలి•స్తే వెనుకబడి పోయిందని పేర్కొన్నారు. సీఆర్‌ ‌రెండో దఫా పాలనలో నిరంకుశ ధోరణి పెరిగిపోయిందనీ, ఏడాది పాలనపై పాకెట్‌ ‌బుక్‌ ‌విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ బుక్‌ ‌ద్వారా రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించనున్నట్లు ఈ•ద ప్రజల ప్రాణాలను రక్షించే ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్సలకు చెల్లింపులు ఆగిపోయే పరిస్థితి నెలకొందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ‌రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం నాంపల్లిలోని టీజేఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంఏడాది కాలంలో నిధులు సమకూర్చుకోవడంలో విఫలమైందనీ, అందుకే ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ధ్వజమెత్తారు. 2019లో ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ, ఆర్థిక క్రమశిక్షణలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో రాజకీయ అవసరాల కోసమే పోలీసులను వాడుతున్నారని ఆరోపించారు. న్యాయమైన డిమాండ్ల కోసం రెండు నెలల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులను మానసిక క్షోభకు గురి చేశారని మండిపడ్డారు. చివరకు వారి డిమాండ్లను నెరవేర్చే సాకుతో ప్రజలపై రూ.వందల కోట్ల భారాన్ని మోపారని విమర్శించారు. పెంచిన ఆర్టీసీ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆర్టీసీ యూనియన్లను గుర్తించకపోవడం దారుణమనీ, విద్యుత్‌ ‌చార్జీల పెంపుపై ఈఆర్సీని కలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నియంత్రణ చాలా అవసరమనీ, ప్రతీ వైన్‌ ‌షాపు అనధికారిక బారుగా మారిందని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 45 వేల కోట్లకు తగ్గిందన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఊసే లేదనీ, ఆసరా పెన్షన్లు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు లబ్దిదారులకు ఆందలేదని విమర్శించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయనీ, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నెలవారీ వడ్డీలకే సరిపోతున్నదని పేర్కొన్నారు. సందర్భంగా కోదండరాం తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy