Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నిలకడగా రోజువారీ కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 298 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 298 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 325 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 89 కేసులు నమోదవగా, కరీంనగర్‌ ‌జిల్లాలో 24 కేసులు, వరంగల్‌ అర్బన్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలలో 21 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,60,142 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,888కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,50,778 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 5,476గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. 

Leave a Reply