Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన….

ఇప్పటి  వరకు  రాష్ట్రంలో 70 లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.  ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘కంటి వెలుగు’’ వైద్య  శిబిరాలలో ప్రజలు  భారీ   సంఖ్యలో  పాల్గొంటున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా   ఇప్పటి   వరకు    70  లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.  కేవలం ఒక్క రోజు శుక్రవారం  నాడు నివేదికలను పరిశీలించగా 2లక్షల 5 వేల 943  మంది వైద్య  పరీక్షలు  చేయించుకున్నారు. 26 వేల కంటి అద్దాలు   ఉచితంగా   పంపిణీ చేయడం జరిగింది.ప్రభుత్వ  ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రజలందరికీ కంటి పరీక్షలు, చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండవ దశ కార్యక్రమం ఉన్నాతాధికారుల నిరంతర పర్యవేక్షణలో విజయవంతంగా కొనసాగుతున్నది.   జనవరి 19 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు వైద్య శిబిరాలు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో వైద్య శిబిరాలు కళకళలాడుతున్నాయి.జిల్లా అధికారులు క్యాంపుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. వైద్య శిబిరాలలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీ, మున్సిపల్‌ ‌వార్డు కేంద్రంగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రతి వారంలో సోమవారం మొదలుకొని శుక్రవారం  రోజు వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాలు కంటి పరీక్షలు చేస్తున్నాయి.  వైద్య శిబిరాల్లో ప్రత్యేక సాప్ట్ ‌వేర్‌ ‌సహాయంతో  కంటి పరీక్షలు చేస్తున్నారు. DEO మరియు ANMలు ట్యాబ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు డేటా నమోదు చేస్తున్నారు. కంటి పరీక్షల తర్వాత ఆదే వైద్య శిబిరంలో అక్కడికక్కడే రీడింగ్‌ ‌గ్లాసుల పంపిణీ చేస్తున్నారు. కంటి వైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నది.
image.png ప్రభుత్వ  సిబ్బందికి సంబంధిత కార్యాలయాలలో, పత్రికా విలేకరులకు ఆయా ప్రెస్‌ ‌క్లబ్‌ ‌ల వద్ద, పోలీస్‌ ‌బెటాలియన్‌ ‌సిబ్బందికి వారి కార్యాలయాలలో ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం  అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కంటి వెలుగు  వైద్య శిబిరాలలో  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 లక్షల 02 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.  కంటి వెలుగు కార్యక్రమములో మొత్తం  ఇప్పటి వరకు 12 లక్షల 29 వేల 98 మందికి  కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో  పల్లెల్లో,  పట్టణాల్లో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అశేష ప్రజానీకం ఉచిత వైద్యం పొందుతున్నారు.
–  కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్‌.

Leave a Reply