రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేకం

  • ఉత్సవాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌ ‌దంపతులు
  • యాదాద్రీశుడిని దర్శించుకున్న సిఎం

ప్రజాతంత్ర, యాదాద్రి భువనగిరి, ఏప్రిల్‌ 25 : ‌సోమవారం యాదాద్రి ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్‌ ‌దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌ ‌దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన క్రతువులో సీఎం కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో కెసిఆర్‌ ‌దంపతులు పాల్గొన్నారు.

ఎర్రవల్లి నుంచి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకున్నారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం రామలింగేశ్వరస్వామివారి సన్నిధిలో జరిగే మహాకుంభాబిషేక మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభించారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల వి•దుగా జరుగుతున్న ఉద్ఘాటన పర్వంలో సీఎం కేసీఆర్‌ ‌దంపతులు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్‌ ‌దంపతులకు తీర్థప్రసాదాలు అందచేశారు.

యాదాద్రిలో రామలింగేశ్వర స్ఫటిక లింగ ప్రతిష్ట
యాదాద్రిలో సోమవారం ఉదయం 10.25 గంటలను ధనిష్ఠానక్షత్ర సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల వి•దుగా సపరివార రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ట చేశారు. అష్టబంధం, ప్రాణప్రతిష్ట, ప్రతిష్ఠాంగహోమం, అఘోర మంత్రహోమం, దీగ్దేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయ మహాకుంభాభిషేకంలో భాగంగా మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామివారి అనుగ్రహ భాషణం చేపట్టారు. అనంతరం మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్టాయాగ పరిసమాప్తి పలికారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెంట మంత్రులు జగదీష్‌ ‌రెడ్డి, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ ‌కుమార్‌, ‌విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జెడ్పీ చైర్మన్‌ ‌సందీప్‌ ‌రెడ్డి, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్‌, ‌సీఎంవో భూపాల్‌ ‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ ‌కుమార్‌ ‌వున్నారు. వీరితో పాటు వైటీడీఏ వైస్‌ ‌ఛైర్మన్‌ ‌కిషన్‌ ‌రావు, ప్రధానార్చకులు నల్లందిగల్‌ ‌నరసింహ చార్యులు, ఈవో గీత వున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చక బృందం. తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల వి•దుగా ఉద్ఘాటన క్రతువును నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ‌వెంట మంత్రులు ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, జగదీష్‌ ‌రెడ్డి, ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page