రాజస్థాన్‌లోనూ ఐటి దాడులు

మంత్రి ఫ్యాక్టరీలో ఐటి సోదాలు
జైపూర్‌, ‌సెప్టెంబర్‌ 7 : ‌దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమై పోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్టాల్రే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి. బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్‌ ‌న్యాయశాఖ మంత్రి ఇండ్లపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. కోల్‌కతా, అసన్‌సోన్‌లోని ఆయనకు చెందిన నివాసాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ ‌పాలిత రాజస్థాన్‌లో.. రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్‌ ‌పార్టికి చెందిన కోట్‌పుట్లీ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్‌ ‌ఫ్యాక్టరీపై ఐటీ అధికారులు దాడులు చేశారు. జైపూర్‌లోని ఆయన ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం కుంభకోణంలో మంత్రి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈనేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు జరిపారు. గుర్తింపులేని రాజకీయ పార్టీలపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ ‌పొలిటికల్‌ ‌పార్టీస్‌ ‌కు చెందిన అక్రమ ఫండింగ్‌ అం‌శంలో ఉత్తరప్రదేశ్‌, ‌ఢిల్లీ, గుజరాత్‌, ‌మహారాష్ట్ర, హర్యానాతోపాటు ఇతర రాష్టాల్లోన్రే ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు, వాటి ఆపరేటర్లు, ఇతరులపై ఎన్నికల కమిషన్‌ ‌చేసిన సిఫారసు ప్రకారమే ఐటీశాఖ అకస్మిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుమారు 87 పార్టీలు ప్రస్తుతం అందుబాటులో లేవని ఎన్నికల సంఘం గుర్తించింది. రూల్స్‌ను అతిక్రమించిన దాదాపు 2100 మంది రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *