- వైద్యారోగ్య శాఖ పరిపాలనా ఉత్తర్వులు జారీ
- గాంధీ, ఉస్మానియా దవాఖానాలపై తగ్గనున్న వొత్తిడి
ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానాల ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. నగరానికి నాలుగు వైపులా ఎల్బీ నగర్, అల్వాల, సనత్‌నగర్‌లలో నిర్మించే దవాఖానాల నిర్మాణానికి రూ.2,679 కోట్లను కేటాయిస్తూ వైద్యారోగ్య శాఖ గురువారం పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రోగులకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ దవాఖానా ఆధ్వర్యంలోనే మూడు దవాఖానాల నిర్మాణం జరుగనుంది. రూ.900 కోట్లతో ఎల్బీనగర్‌లో, రూ.882 కోట్లతో సనత్‌నగర్‌లో, రూ.897 కోట్లతో అల్వాల్‌లో కొత్త దవాఖానాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఎంఎస్‌ఐడిని, డీఎంఈకి వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, నగరానికి నలుగు వైపులా కొత్త దవాఖానాల ఏర్పాటుతో గాంధీ, ఉస్మానియా దవాఖానాలకు ఇతర జిల్లాల నుంచి వొచ్చే రోగుల తాకిడి తగ్గనుంది.