Take a fresh look at your lifestyle.

రాగల మూడురోజుల్లో తేలికపాటి వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌రాష్ట్రంలో రాగల మూడు రోజులు  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల ఐదు రోజులుల్లో రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌  ‌కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.  కొన్ని చోట్ల 35•బిఅ కన్నా తక్కువగా అక్కడక్కడ  నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.మంగళవారం నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు,  మెరుపులు,ఈదురు గాలులు వానలు పడతాయని పేర్కొంది. ఏప్రిల్‌ 25‌వ తేదీన  గంటకు 40 నుండి 50  కిలో  టర్ల వేగంతో..ఏప్రిల్‌ 26‌వ తేదీన, ఏప్రిల్‌ 27‌వ తేదీన  30  నుండి 40 కిలోటర్ల వేగం తో గాలులు వీస్తాయని దీంతో పాటు.. వడగళ్ళతో కూడిన వర్షములు అక్కడక్కడ  పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్‌ 25‌వ తేదీ ఉపరితల ద్రోణి  పశ్చిమ విధర్బ లోని ఆవర్తనం నుండి  మరాఠ్వాడ  దగా దక్షిణ ఇంటీరియర్‌ ‌కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి  ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.  దిగువ స్థాయిలోని గాలులు  దక్షిణ,..ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయిని పేర్కొంది.

Leave a Reply