Take a fresh look at your lifestyle.

రక్త మోడుతున్న రహదారులు…

అతివేగం హానికరం, భద్రతా నియమాలు పాటించు భరోసాగా జీవించు,ఏంటి కొటేషన్లు చెబుతున్నారు అనుకుంటున్నారా, రోజురోజుకు   రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మాట చెప్పవలసి వస్తుంది. రోజురోజుకు రహదారులన్నీ రక్తంతో ఎరుపెక్కుతున్నాయి. ఎక్కడో ఒకచోట  కూలీల వాహనం ఎదురు వాహనం  ఢీకొని, వాహనాలు పాదాచారులను ఢీకొని వారు చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 13 లక్షలమంది చనిపోతుంటే, అయిదు కోట్లమంది క్షతగాత్రులవుతున్నారు. ప్రతి మూడు నిమిషాలకో మరణం జరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశం మనదే. ప్రగతి భాగ్యరేఖలైన రహదారులు ప్రతిరోజూ నెత్తురోడుతున్న దేశం మనది. దేశీయ రహదారుల పొడవు 47లక్షల కిలోమీటర్లు. 27 శాతానికి పైగా రోడ్డు ప్రమాదాలు నేషనల్‌ హైవేల మీదనే నమోదవుతున్నాయి.
రోజుకు పాతికమంది పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న దేశం మనది. రహదారి ప్రమాదాలు , రహదారి మీద సంభవించే ప్రమాదాలను రహదారి ప్రమాదాలు అంటారు.రహదారి ప్రమాదాలలో సాధారణంగా వాహనాలు ఒకదానినొకటి గాని, లేదా రహదారి మీద నడిచే పాదాచారుల్ని లేదా జంతువుల్ని ‘డీకొట్టి’ ద్వారా జరుగుతున్నాయి .రహదారి ప్రమాదాల వలన రహదారి మీద ప్రయాణించే ప్రయాణికులకు,జంతువులకు గాయాలు, కొన్ని సందర్బాలలో మరణాలు సంభవిస్తాయి.వాహనాలకు నష్టం జరుగు సందర్బాలు ఉంటాయి.ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడటం,హెల్మెట్‌ ధరించకపోవటం ,సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దంతో హారన్‌లు మోగించుకుంటూ ఆకతాయిల్లాగా వాహనాలు నడపటం ,ట్రాఫిక్‌ పోలీసులతో తగాదాకు దిగడం అలవాటైపోయింది.రహదార్లు బాగుండవు. సిగ్నలింగ్‌ వ్యవస్థ సరిగా పనిచేయదు.పాదచారులకు కేటాయించిన ఫుట్ పాత్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రమాదాలకు గురవుతున్నారు.
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతీ సంవత్సరం దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలకి సంబంధించి ఒక నివేదికని విడుదల చేస్తుంది.లేటెస్ట్ రోడ్ ఆక్సిడెంట్స్ ఇన్ ఇండియా – 2019 రిపోర్ట్ ప్రకారం, 2019 సంవత్సరంలో దేశం మొత్తంలో 4,49,002 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. గత పది సంవత్సరాలతో పోల్చుకుంటే 2019లోనే ఈ సంఖ్య తక్కువగా ఉంది.2019లో 63% – 73% రోడ్డు ప్రమాదాలకి, అలాగే 62% – 70% రోడ్డు ప్రమాదాల మరణాలకు అతివేగం కారణం.2020-2023 మధ్య కాలం లో రోడ్డు ప్రమాదాల మరణాల రేటు గతం కంటే 3% నుండి 5% ఎక్కువ పెరిగింది.మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రెడ్ లైట్ బ్రేక్ చేయడం మరియు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ వినియోగం,మొదలైన ఇతర కారణాలు కూడా రోడ్ ఆక్సిడెంట్లకి దారి తీస్తున్నాయి.చాలా ప్రమాదాలు ర్యాష్ డ్రైవింగ్ మరియు మితిమీరిన వేగం వల్ల జరుగుతున్నాయి.పెరుగుతు న్న జనాభా, వలసల కారణంగా నగరాల్లోని రోడ్లన్నీ వాహనాలతో దట్టంగా మారుతున్నాయి.ఇరుకైన రోడ్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.రోడ్డు ప్రమాదాల సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తుంది.అయినప్పటికీ టోల్ పెరుగుతూనే ఉంది.
కేంద్ర ప్రభుత్వం టోల్ టాక్స్ దీనివల్ల సామాన్యుల బస్సు ప్రయాణం భారంగా మారడమే కాకుండా నిత్యవసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో జాతీయ రహదారులకు సంబంధించిన 32 టోల్ గేట్ల వద్ద టోల్ టాక్స్ లు పెంచుతున్నట్లు కేంద్రం  ప్రకటించింది. ఇప్పటికే టోల్ టాక్స్ భారంతో తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నందున మరింత భారం మోపద్దని ప్రజలు కోరుకుంటున్నారు. 2014లో తెలంగాణ వ్యాప్తంగా రూ. 600 కోట్లు వసూలు చేయగా, ప్రతి ఏడాది పెంపుతో అది 2023లో రూ.1824 కోట్లకు పెరిగింది. గడిచిన తొమ్మిది ఏళ్లలో టోల్ టాక్స్ వసూళ్లు 300% పెరిగిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో మధ్యతరగతి ప్రజల జీవనం మరింత భారంగా మారింది. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం కేంద్రం 9 ఏళ్లలో రూపాయలు 20,350 కోట్లు ఖర్చు చేయగా గడిచిన తొమ్మిది ఏళ్లలో టోల్ ద్వారా 9000 కోట్లు వసూలు చేసింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతోపాటు అదనపు రోడ్ సేస్సుల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి గడిచిన తొమ్మిది ఏళ్లలో కేంద్రం చాలా కోట్లు వసూలు చేసింది.చాలా సందర్భాలలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వ్యక్తులే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇరవై ఒకటవ శతాబ్దం ప్రారంభం నుండి, భారతదేశంలో రోడ్లు సరిగ్గా వేయబడ్డాయి. హైవేలు మరియు ప్రధాన రహదారులు మంచి నాణ్యతతో ప్రమాదాలు సంభవించే అవకాశాలను నివారిస్తాయి. అయితే, అసాధారణమైన సందర్భాల్లో, ఇతర వైఫల్యాల కారణంగా వాహనాలు మీడియన్‌లు లేదా డివైడర్‌లను ఢీకొట్టి ప్రాణాపాయం కలిగిస్తాయి.
రోడ్డు ప్రమాదాలు జరగడానికి మద్యం తాగి వాహనాలు నడపడం మరో కారణం. ఈ బాధ్యతారహిత పౌరులు ప్రమాదాలకు కారణం కావడమే కాదు, అదే సమయంలో వారు దాని బారిన పడుతున్నారు. తక్కువ అనుభవం లేని వాహనాలు నడిపే వారు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇవి కాకుండా మన దేశంలో జరుగుతున్న మొత్తం ప్రమాదాల్లో దాదాపు యాభై శాతం ర్యాష్ డ్రైవింగ్ వల్లనే జరుగుతున్నాయి. నగరంలోని ఏదో ఒక మూలలో ఓ పిచ్చివాడైన వ్యక్తి వాహనం నడుపుతూ తీవ్ర ప్రమాదానికి కారణమయ్యాడు. దీని వల్ల పాదచారులు, తోటి ప్రయాణికులు వంటి అమాయకులు చనిపోతున్నారు.ఓవర్ స్పీడ్ వేగం పరిమితులు దాటి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. రోడ్డు ప్రమాదాల్లో 70 శాతానికి పైగా మితిమీరిన వేగం వల్లే జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాల వల్ల 65 శాతం మరణాలు సంభవిస్తున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
రోడ్డు ప్రమాదాల మరణాలలో ఆరు శాతానికి పైగా లేన్ క్రమశిక్షణారాహిత్యం కారణంగానే సంభవిస్తున్నాయి.
డ్రైవర్ తన వాహనాన్ని తన సొంత లేన్‌లో ఉంచడంలో విఫలమైతే, వారు ఇతర వాహనాలను ఢీకొట్టే ప్రమాదం ఉంది.జంపింగ్ రెడ్ లైట్లు
ట్రాఫిక్ లైట్లు ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగ్గా నడిపించడంలో మరియు ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి. కొంతమంది డ్రైవర్లు, సమయం లేదా ఇంధనాన్ని ఆదా చేసేందుకు, ట్రాఫిక్ లైట్ ఎరుపు రంగులో ఉన్నప్పటికీ, వారి మరియు ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి డ్రైవ్ చేస్తూనే ఉన్నారు.మద్యం తాగి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు మరో ప్రధాన కారణం. డ్రైవింగ్‌కు చాలా ఏకాగ్రత మరియు శీఘ్ర ప్రతిచర్యలు అవసరం. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన ఇంద్రియాలు మరియు అభిజ్ఞా సామర్థ్యాలు మొద్దుబారిపోతాయి మరియు ప్రాణాంతకమైన కారు ప్రమాదాలు లేదా జీవితకాల వైకల్యాలకు కారణమవుతాయి.మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం పైన చెప్పినట్లుగా, డ్రైవింగ్ అనేది చాలా దృష్టి అవసరం.
డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇతర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఫోన్‌లో మాట్లాడడం వల్ల ప్రమాదాలు జరగడం ఖాయం.బెల్టులు మరియు హెల్మెట్‌ల వాడకాన్ని నివారించడం సీట్ బెల్ట్‌లు మరియు హెల్మెట్‌లు డ్రైవర్‌ను మరియు రైడర్‌ను ప్రమాదాల నుండి రక్షించడానికి ఉద్దేశించబడ్డాయి. అయితే చాలా మంది రోడ్డు వినియోగదారులు, అలాంటి భద్రతా అంశాలను పట్టించుకోరు మరియు వారి జీవితాలను మరియు వారి సహ-ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించాలి.అన్ని ట్రాఫిక్ నియమాలను పాటించడం, రక్షణ గేర్‌లు ధరించడం మరియు దృష్టి మరల్చకుండా డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది.రోడ్డు భద్రత మరియు జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వ అవగాహన ప్రచారాల గురించి రోడ్డు వినియోగదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.వారు చాలా పాత వాహనాలను ఉపయోగించకూడదు, ఎందుకంటే అవి హెచ్చరిక లేకుండా పనిచేయకపోవడమే ఎక్కువ. ఏడాదికి 1,50,000 మంది రోడ్డు ప్రమాదాలలో మరణి స్తున్నారని, రానున్న రోజుల్లో  మరణాలను తగ్గిస్తామ ని ‘బ్రెజీలియా కన్వెన్షన్‌’ తీర్మానంపై భారత ప్రభుత్వం సంతకం చేసింది. మరణాలను తగ్గించడానికే ఎం.వి. యాక్ట్‌ – 1988 సవరణ బిల్లును ముందుకు తెచ్చామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం, రోడ్డు భద్రతకు సంబంధించి ఏ ఒక్క చాప్టర్‌ను అందులో చేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నది. వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గించడానికి ప్రధానంగా ప్రజా రవాణా సంస్థను అభివృద్ధి చేయాలి.
నిర్దిష్ట సమయాలలో ప్రజా రవాణా వాహనాలను మాత్రమే అనుమతించాలి.రోడ్ల సామర్ధ్యానికి తగ్గట్టుగానే వాహనాలను నియంత్రించాలి.హైవే లన్నింటిలో రోడ్ల విభజన అమలు చేయాలి.యూటర్న్‌లు, లింక్‌ రోడ్స్‌ వద్ద సిగల్‌బోర్డులు, ఇండికేటర్లు ఏర్పాటు చేయాలి. డ్రైవర్లకు ఒత్తిడి తగ్గించడానికి అధిక పనిగంటల నుండి నియంత్రణ వుండాలి. హైవేలలో ప్రతి 100 కిలో మీటర్లు హోటల్‌, రెస్ట్‌ హౌస్‌లు ఏర్పాటు చేయాలి. అన్ని ట్రాఫిక్‌ సిగల్స్‌ వద్ద కౌంట్‌డౌన్‌ టైమింగ్‌తో సిగల్స్‌ ఏర్పాటు చేయాలి. రోడ్‌ భద్రతా ప్రాధాన్యత, ట్రాఫిక్‌ రూల్స్‌ను 5వ తరగతి నుండి పాఠ్యాంశంగా చేర్చాలి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల రోడ్లు నిత్రోడుతున్నాయి.జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలకు అంతులేదు. వాహనదారుల అతివేగంవల్ల ప్రతిరోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు మొదలుకొని, ద్విచక్ర వాహనాల వరకు రోడ్డుపై పరిమితికి మించి, అతివేగంతో దూసుకుపోతున్నాయి. అతివేగం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, నిర్లక్ష్యపు ఓవర్‌ టేక్‌లు, సెల్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌, నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం, ముగ్గురు లేదా నలుగురు ఎక్కి యువత నిర్లక్ష్యంతో అతివేగంగా బైక్‌లను నడపడం, ఆ బైక్‌లపై విన్యాసాలు తదితర కారణాలు రోడ్డు ప్రమాదాలను పెంచుతున్నాయి. నిర్లక్ష్యం ఒకరిది, ప్రాణాలు కోల్పోయేది ఇతరులది. పోలీసుల తనిఖీ ముమ్మరం కావాలి.
రహదారులపై అతివేగంగా నడిపేవారిని, డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ చేసినవారినీ, పరిమితికి మించి జనాలతో వెళ్ళుతున్న వాహనదారులను, మొబైల్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసేవారిని పట్టుకొని అతి భారీగా జరిమానాలు విధించాలి. ప్రమాదకారకులైతే కఠిన శిక్షలు విధించాలి. సురక్షిత ప్రయాణానికి సహకరించాలి.ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఎందరో ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం జరుగుతుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న ప్రమాదాలు మృతుల సంఖ్య తగ్గడం లేదు.అతివేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్ల బ్రతుకులు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు గల పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదాలు అజాగ్రత్త, మద్యం మత్తు, అతివేగం, శీతాకాలంలో మంచి వలన రహదారులు కనబడకపోవడం,నిద్రమత్తు, వాహనం సాంకేతిక లోపాలు, ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
రాజకీయ నాయకుల సంతానం,  సెలబ్రిటీలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినప్పుడు చర్చ జరగడం తప్ప,మిగతా సందర్భాల్లో చర్చ జరగడం లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎంత జాగ్రత్తగా వ్యవహరించిన ఒక్కోసారి అమాయక పాదాచార్ల ప్రాణాలు, వాహనాలకు బలైపోవడం, వాహనం కెపాసిటీ కంటే ఎక్కువ మంది  ఇందులో ప్రయాణించడం ద్వారా కూడా  ప్రమాదాలకు గురవుతున్నారు. హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలకు గురై ఎంతోమంది మరణిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ, వాహనదారులు వాటిని సరిగా పాటించడం లేదు. ప్రమాదాలను అరికట్టడానికి చట్టాలను కఠినంగా అమలు చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేటప్పుడే చట్టాలపై అవగాహన కల్పించి రోడ్డు భద్రత అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ లను జారీ చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రమాదాల నివారణ కోసం జాతీయ, రాష్ట్ర రహదారులపై  రోడ్ సేఫ్టీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసింది. అంతేకాకుండా లేజర్ గన్స్,స్పీడ్ గన్స్, బ్రీత్ ఎనలైజర్, ఫస్ట్ ఎయిడ్ వైద్యం సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రోడ్డు భద్రత లో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ, నిత్యం వాహన తనిఖీలను చేస్తూ కట్టుదిట్టపైన ఏర్పాట్లను తీసుకుంటుంది. ఇలా చేయడం వల్ల గతం కంటే ప్రమాదాలను కొంతవరకు నివారించగలిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వమే కాకుండా, వాహనదారులు ఎవరికి వారే,  స్వచ్ఛందంగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరగవు.
image.png
   – మోటె చిరంజీవి,
సామాజిక విశ్లేషకులు,
 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి],
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్
     సెల్ : 9949194327.

Leave a Reply