రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహించాలి
రక్తదానం చేసి ప్రాణదానం చేయాలి
బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహా రెడ్డి
కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 25 : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా కందుకూరు లయన్స్ క్లబ్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సంయుక్తంగా జరిపిన స్వచ్చంద రక్తదాన శిబిరంలో 31 మంది యువకులు రక్త దానం చేయడం జరిగింది.అంతకుముందు శిబిరాన్ని ప్రారంభించిన భాజపా జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి,లయన్స్ జిల్లా వైస్ గవర్నర్ డాక్టర్ మహేందర్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ, ప్రాణాపాయ స్థితిలో అవసరమైన రక్తం దొరకక రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని,ఇలాంటి రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు.18 సంత్సరాలపైబడి 45 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్న వారందరూ రక్త దానానికి అర్హులే అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మహేశ్వరం నియోజక వర్గ ఇంచార్జ్ ఎల్మటి దేవేందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, సర్పంచ్ సాద మల్లారెడ్డి,పిఎసిఎస్ డైరెక్టర్,నాయకులు భూం రెడ్డి,జంగా రెడ్డి, దయాకర్ రెడ్డి,వెంకట్ రెడ్డి,వెంకటేష్ , శ్రీనివాస్,లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మ అంజి రెడ్డి,మాజీ అధ్యక్షులు తాళ్ళ అంజయ్య,సురసాని వెంకట రంగారెడ్డి, కార్యదర్శి కే. వెంకటేశ్వర్లు,కోశాధికారి జి. రామన్ బాబు తదితరులు పాల్గొన్నారు