వసంతోత్సవ పండుగ వేళా
హరివిల్లు ఇలపై విరిసినట్లు
హర్షజల్లు ఎదపై కురిసినట్లు
మనస్సు సంబురాల మేలా
తనువు తన్మయాల హేలా
పాల్గుణ పూర్ణమి వేళా
వర్ణకాంత వన్నెలీనినట్లు
కృష్ణుడు వేణువూదినట్లు
జగతి ఆద్యాత్మిక సందడి
భక్తి పరవశ నృత్య సవ్వడి
ఈ శుభమంగళ రోజున
సకల జనావలి సమైక్యమై
సప్త రంగులు చల్లుకుంటూ
ఆత్మీయ గంగలో తేలాడేను
ప్రేమైక నింగిలో విహరించేను
డోలీకోత్సవ సమయాన
అబాలగోపాలం మమేకమై
చిందేస్తూ చిద్విలాసం చేస్తూ
ఆనంద ఆందోళికలో ఊగేను
ఆహ్లాదాల పల్లకిలో ఊరేగేను
రంగుల పండుగ సర్వత్రం
కామదహనాలు, కోలాటాలు
జనపదగీతాలు నృత్యాలతో
ఊరువాడలు పులకరించేను
సంబరాలు అంబరాన్నంటేను
సమైక్య జీవన సందేశమై
భక్తి విశ్వాస సంకేతమైన
రంగుల ‘హొలీ’ వేడుకను
ఉత్సాహంగా జరుపుదాం
సంస్కృతి కీర్తి చాటుదాం
“””””””””””
(హోలీ పర్వదిన శుభాకాంక్షలతో…)
కోడిగూటి తిరుపతి
Mbl no:9573929493