Take a fresh look at your lifestyle.

యూనివర్సిటీ కామన్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డ్ ‌బిల్లుకు ఆమోదం తెలుపండి

  • డిమాండ్‌ ‌చేస్తూ విద్యార్థి సంఘాల రాజ్‌భవన్‌ ‌ముట్టడి
  • భారీగా తరలి వొచ్చిన విద్యార్థులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : వివిధ విద్యార్థి సంఘాల ముట్టడితో రాజ్‌భవన్‌ ‌వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ కామన్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డ్ ‌బిల్లుకు గవర్నర్‌ ‌తమిళిసై వెంటనే ఆమోదం తెలపాలంటూ మంగళవారం ఉదయం వివిధ విద్యార్థి సంఘాలు రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. బీఆర్‌ఎస్‌వీ ఇతర విద్యార్థి సంఘాల నేతలు రాజ్‌భవన్‌ ‌ముందు బైఠాయించి నిరసనకు దిగారు. గవర్నర్‌ ‌డౌన్‌ ‌డౌన్‌ అం‌టూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ ‌చేసిన వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు వి•డియాతో మాట్లాడుతూ… యూనివర్సిటీ కామన్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డ్ ‌బిల్లును గవర్నర్‌ ‌పెండింగ్‌లో పెట్టడం వల్ల సుమారు 3 వేల ప్రొఫెసర్‌ ‌పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

బీజేపీ నేతలు బండి సంజయ్‌ , ‌కిషన్‌ ‌రెడ్డి  చెప్పినట్లు గవర్నర్‌ ‌తమిళిసై వింటున్నారని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు గవర్నర్‌ ‌వెంటనే ఆమోదం తెలపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ ‌చేశారు.  దాదాపు ఎనిమిది కీలక బిల్లులను గవర్నర్‌ ‌తమిళిసై తన వద్దే పెట్టుకున్న విషయం తెలిసిందే. గతేడాది తెలంగాణ శాసనసభ, మండలిలో ఆమోదం పొందిన ఎనిమిది బిల్లులను ప్రభుత్వం గవర్నర్‌ ‌వద్దకు పంపించింది. అయితే ఇప్పటి వరకు ఆ ఎనిమిది కీలక బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందలేదు. ఐదు నెలలు గడిచినప్పటికీ గవర్నర్‌ ఆ ‌బిల్లులకు ఆమోదం తెలుపకుండా తనవద్దే ఉంచుకున్నారు. ఇదిలావుంటే 8 బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలుపకపోవడంతో దాన్ని సవాల్‌ ‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌ధాఖలు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈనెల 2న సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌వేశారు.

రాజ్‌భవన్‌ ‌తీరుపై మండిపడ్డారు. పిటిషన్‌పై గవర్నర్‌ ‌తమిళిసై తనదైన శైలిలో స్పందిస్తూ… శాంతికుమారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక… రాజ్‌భవన్‌కు వొచ్చేందుకు సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. దిల్లీ కన్నా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ ‌దగ్గరే అని సీఎస్‌కు మరోసారి గుర్తుచేస్తున్నా అంటూ గవర్నర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. అయితే ఇటీవల బ్జడెట్‌ ‌సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో వివాదం సమసిపోయిందని అంతా భావించారు. ఇంతలోనే పెండింగ్‌ ‌బిల్లుల అంశం మళ్లీ తెరపైకి రావడంతో గవర్నర్‌.. ‌రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం ఎప్పుడు సమసిపోతుందో వేచి చూడాలి.

Leave a Reply