ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాష్ట్రంలో యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారడం ఆందోళన కలిగిస్తున్నదని టీ పీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా ఆగడాలకు తెరదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. మత్తు మందులకు బానిసై 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని నిర్ఘాంతపోయేలా చేసిందన్నారు. దీనిపై జాతీయ స్థాయిలో సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం డ్రగ్స్ వినియోగ కేంద్రంగా మారుతున్నదని గడచిన ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ చెబుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. డ్రగ్స్ భూతం ఏదో విధంగా పడగ విప్పినప్పుడల్లా అందులో ప్రమేయం ఉన్న రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుదని ఆరోపించారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ కారిడార్ ఏర్పాటు అయిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని టాస్క్‌ఫోర్స్ కమటీలు వేసినా, ప్రత్యేక అధికారులతో పర్యవేక్షణ చర్యలు చేపట్టినా డ్రగ్స్ మాఫియా అంతం కావడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ సరఫరాకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
సెల్ఫ్ డబ్బా ఆపి చర్యలు తీసుకోండి
వరంగల్ ఎంజిఎం ఘటనపై రేవంత్ ట్వీట్
కెసిఆర్ కిట్..హాస్పిటళ్లలో అన్ని వైద్య సేవలు అంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం మానుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. పొంత డబ్బా మాని సౌకర్యాలపై దృష్టి పెట్టాలన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్సలో వున్న రోగిని ఎలుకలు గాయపరిచిన ఘటన సంచలనం
కలిగించినవిషయం తెలిసిందే. ఈ విషయంపై రేవంత్ తీవ్రంగా స్పందిస్తూ.. హాస్పిటల్‌లో శానిటేషన్ పనులు సరిగా చేయకపోవడం వల్లే ఎలుకలు వొస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్దారించిన సంగతి తెలిసిందే. దీంతో హాస్పిటల్‌లో డ్రైనేజీ, పారిశుధ్య పనులను మెరుగుపర్చాలని అధికారులను అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. మౌలిక వసతులు మెరుగుపరచకుండా సెల్ప్ డబ్బా కొట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వరంగల్ ఎంజిఎం గురించి గొప్పలు చెప్పిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశించారు. వెంటనే హాస్పిటళ్లలో సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.