యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు

  • పాలనా యంత్రాంగం దృష్టి సారించాలి
  • ధాన్యం మద్దతు ధరకు కొనేలా చర్యలు
  • సేకరణ, రవాణాపై పక్కాగా ప్రణాళిక
  • జిల్లా కలెక్టర్లకు సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌దిశానిర్దేశం

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 13 : ‌ప్రతి జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ఆదేశించారు. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలన్నారు. రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్‌ ‌కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్‌, ‌పౌర సరఫరాల అధికారులతో సోమేశ్‌ ‌కుమార్‌ ‌బుధవారం టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ ‌రావు, పంచాయితీ రాజ్‌ ‌శాఖ కార్యదర్శి సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా, పౌర సరఫరాల శాఖ కవి•షనర్‌ అనీల్‌ ‌కుమార్‌, ‌మార్కెటింగ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌లక్ష్మిబాయిలు కూడా పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లలో ప్రత్యేకంగా కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు మానిటర్‌ ‌చేయాలని, రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లోను ప్రత్యేక కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లాల్లో సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిపి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వెంటనే సవి•క్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులచే వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని, జిల్లా కలెక్టర్‌, అడిషనల్‌ ‌కలెక్టర్‌, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు. గత యాసంగిలో ఏర్పాటు చేసినన్ని కేంద్రాలు గానీ అంతకన్నా ఎక్కువైనా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలని, ప్రతీ కేంద్రానికి ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గన్ని బ్యాగుల సేకరణకై ప్రత్యేక దృష్టిని సాధించాలని, దీనికై ప్రత్యేక అధికారిని నియమించి తగు పర్యవేక్షణ చేయాలన్నారు. ధాన్యం క్వింటాల్‌కు రూ.

1960 కనీస మద్దతు ధరగా నిర్ణయించడం జరిగిందని, అందుకు అనుగుణంగా కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలను ధాన్యం కొనుగోలులో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, తమ జిల్లాలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో ఏవిధమైన సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు తగు వాహనాల ఏర్పాట్లను చేసుకోవాలని, ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలు సమర్పించాలని సిఎస్‌ ఆదేశించారు. జిల్లాల్లో వరి కోతల వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉన్నాయని, వీటి ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని, పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలని, దీనికై పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సిఎస్‌ అధికారులకు నిర్దేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page