- గతంలో లాగా గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు
- క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు
- 111 జీఓ ఎత్తి వేస్తూ కేబినేట్ కీలక నిర్ణయం
- మరో 6 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం
- శంషా బాద్ ఎయిర్‌పోర్టు విస్తరణకు ఆమోదం
- కేబినేట్ నిర్ణయాలను వెల్లడించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్,ఏప్రిల్12: రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. ధాన్యం కొనుగోలుపై సాధ్యాసాధ్యాలపై కేబినెట్ భేటీలో చర్చించిన మంత్రులు.. చివరకు ప్రభుత్వమే కొనాలని నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం కెసిఆర్ డియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ, కేంద్రం తీరుపై ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. క్వింటాల్ ధాన్యానికి రూ.
1960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కూడా సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నట్లు కూడా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని, రైతాంగం సుఖంగా వుందని కెసిఆర్ అన్నారు. తమ చర్యల వల్ల ఒక కోటి ఎకరాల పంట విస్తీర్ణం పెరిగిందని, అందుకే పంటలు బాగా పండాయని వివరించారు. అయితే కేంద్రంలో పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక ప్రభుత్వం వుందని, ఇది భారత రైతాంగ దురదృష్టమని విరుచుకుపడ్డారు. 13 నెలల పాటు రైతాంగం ఢిల్లీలో ధర్నాకు దిగాయని, చివరికి కేంద్రం దిగివచ్చి, ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేశారని గుర్తు చేశారు.
ఇంత దిక్కుమాలిన, దరిద్రపు గొట్టు ప్రభుత్వం కేంద్రంలో వుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ ఘట్టాలన్నింటికీ దేశ ప్రజలే ప్రత్యక్ష సాక్ష్యులని, అదంతా ఓ చరిత్ర అన్నారు. ఉద్యమాలు చేస్తున్న సమయంలో రైతులను మోదీ ప్రభుత్వం అనేక రకాలుగా తూలనాడారని, ఉగ్రవాదులుగా అభివర్ణించారని కేసీఆర్ మండిపడ్డారు. దేశంలోని వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలని ఓ బలమైన కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, దాన్ని దృష్టిలో పెట్టుకొనే వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేస్తోందని కేసీఆర్ దుయ్యబట్టారు. గ్రాణ ఉపాధి హా పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తామని బీజేపీ ఎన్నికల హాలో పెట్టారని, అయినా దానిని అమలు చేయరని ఎద్దేవా చేశారు. వీటన్నింటితో పాటు ఎరువుల ధరలు కూడా పెంచారని మండిపడ్డారు.
తాజా పార్లమెంట్ సమావేశాల్లో తమకు అవసరమైన బిల్లులను పాస్ చేయించుకున్నారే తప్పించి, రైతులకు అవసరమైన వాటిని మాత్రం ముట్టుకోలేదని మండిపడ్డారు.ఇకపోతే త్వరలోనే హైదరాబాద్‌లో దేశ రైతాంగ ప్రతనిధులు, రైతు సంఘాలనాయకులతో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించి, అందరి అభిప్రాయాలు తీసుకుని సమగ్ర వ్యవసాయ విధానం రూపొందిస్తామని అన్నారు. దీనిని అమలు చేస్తే స్వాగతిస్తామని లేకుంటే బిజెపి ఖర్మానికి వదిలేస్తామని అన్నారు. ఇకపోతే తెలంగాణలో మరో ఆరు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆమోదం లభించిందన్నారు. దీంతోపాటు అమిటీ, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీ) , గురునానక్, నిప్‌మర్, ఎంఎన్‌ఆర్ యూనిర్సిటీల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవోలు, విధివిధానాలను సంబంధిత మంత్రులే చూసుకుంటారని చెప్పారు. అలాగే, ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందని సీఎం తెలిపారు.
ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చాయని సీఎం కేసీఆర్ వివరించారు. ఇకపోతే రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల్లో అడ్డంకిగా ఉన్న111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఆరు కొత్త ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు 111 జీవోను ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో నదులు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. మే 20 నుంచి జూన్ 5 వరకు ప్లలె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తాం. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సెకండ్ రన్‌వే కోసం చర్యలు చేపడతాం. యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.ప్రపంచంలో సివిల్ ఏవియేషన్ విస్తృతంగా పెరుగుతోందని, తెలంగాణలో కూడా వేగం పుంజుకున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన డియా సమావేశంలో మాట్లాడారు.