యాదాద్రిలో దంచికొట్టిన వాన… పనుల్లో నాణ్యాతలోపాలు బట్టబయలు

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదగిరిగుట్టలో అకాలవర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. యాదగిరిగుట్టలో అత్యధికంగా 8.3 సెంటీవి•టర్లు, మోత్కూరులో 7.5, రామన్నపేటలో 6.9 సెంటీవి•టర్ల వర్షం నమోదయింది. అకాల వర్షంతో ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు కొట్టుకుపోగా..క్యూలైన్లు చెరువులను తలపిస్తున్నాయి. యాదగిరి గుట్ట ఆలయం పునర్నిర్మాణ పనులు జరిగి నెలలు గడవకముందే ఒక్క భారీ వర్షానికే ఘాట్‌ ‌రోడ్డు కుంగిపోయింది. ఆ ప్రాంతం బురదమయం కావడంతో బస్సులు దిగబడిపోయాయి. ఫలితంగా కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో యాదాద్రి అభివృద్ధి పనుల్లో డొల్లతనం బయట పడింది.

సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న దివ్య క్షేత్రంలో పనులు ఎంత నాసిరకంగా జరిగాయో తేటతెల్లమైంది. ఒకే ఒక్క వర్షానికి అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలయ అభివృద్ధికి దాదాపు రూ. 2వేల కోట్లు ఖర్చుచేయగా.. ఘాట్‌ ‌రోడ్డు మొదలు.. క్యూ లైన్ల వరకు వర్షపు నీరు నిలిచింది. పరిస్థితి చూస్తే నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు పాటించారో అర్థమవుతుంది. దర్శనానికి వొచ్చిన భక్తులు కాలినడకన కొండపైకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రెసిడెన్షియల్‌ ‌సూట్‌ ‌రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న రింగ్‌ ‌రోడ్డు చెరువును తలపిస్తుంది. ఇక కొండపైన పరిస్థితి చూస్తే ఈదురుగాలులకు చలువ పందిళ్లు కుప్పకూలాయి. క్యూ కాంప్లెక్స్, ‌క్యూలైన్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పరిస్థితి మరింత అద్వానంగా మారింది. సీఎం కేసీఆర్‌ ‌ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణాల్లో డొల్లతనం బయటపడటంపై భక్తులు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page