పాఠశాల విద్యాశాఖ స్పష్టీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3 : వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వొచ్చిన నేపథ్యంలో మంగళవారం నాటి పరీక్ష వాయిదా వేసినట్లు సోషల్ వి•డియాలో కథనాలు వొచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పందిస్తూ వివరణనిచ్చింది. నేటి పదో తరగతి పరీక్ష వాయిదా పడలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మంగళవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు అన్ని పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

ఇక తెలుగు ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపిన వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపిన ఉపాధ్యాయుడు బందప్ప, మరో ఇన్విజిలేటర్ సమ్మప్ప, చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ గోపాల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్లు శ్రీ దేవసేన తెలిపారు.