హైదరాబాద్ రోడ్ షో ప్రచార సభలలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25 : పీఎం మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. శనివారం సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. బిడ్డ కోసమే కేసీఆర్ మోదీతో చేతులు కలిపిండని మండిపడ్డారు.. ఇద్దరూ ధనవంతులకే కొమ్ముకాస్తున్నరన్నారు. పేదలను మరింత పేదలుగా చేస్తున్నరని, పేదల ఖాతాల్లో మోదీ రూ.15 లక్షలు వేస్తామన్నారు.
వేశారా…రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ చెప్పారు.. చేశారా…2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారు…ఇచ్చారా..అంటూ ప్రశ్నించారు. ఆప్ సర్కారుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కయ్యారన్నారు. ఆయన ఆప్‌తో మద్యం స్కామ్‌లో పాలుపంచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తెచ్చిన పరిశ్రమలను కేంద్ర సర్కారు అమ్ముకుంటుందని, ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిందని, బీఆర్‌ఎస్ సర్కారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచిందని అన్నారు.