వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: హరిత తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు భారీగా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు చక్కటి వాతావరణం అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతయుతంగా చెట్లను పెంచి దేశ ప్రగతిని పెంచడంలో భాగస్వాములై భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షులు రామ్ రెడ్డి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి ఎంపీపీ చంద్రకళ మండల మైనార్టీ పార్టీ ప్రెసిడెంట్ గజాజుద్దీన్ ఎంపీడీవో సత్తయ్య ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.