ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చీరలను కల్వకుర్తి శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ మహిళలకు పంపిణీ చేశారు. కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జడ్పిటిసి దశరథ్ నాయక్, ఎంపిటిసి లచ్చిరాం నాయక్, జోగు వీరయ్య, హర్యానాయక్, మైసిగండి గ్రామ సర్పంచ్ తులసి రామ్ నాయక్, వార్డ్ సభ్యులు ఆర్ పత్య నాయక్, రాజేష్ గౌడ్, ప్రేమ, జవహర్లాల్, రాందాస్, మాజీ ఎంపిటిసి సక్రి, శ్రీను, మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..