హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి3: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళకు దిగారు. తమకు వెంటనే మెస్ సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డు పై కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత రెండు నెలలుగా తమకు మెస్ వసతి కల్పించటం లేదని ఇ-2 హాస్టల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ••అకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.