ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 : కడ్తాల గ్రామపంచాయతీకి చెందిన లక్నమోని చిట్టి శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా రూ.5వేలు (ఐదువేల రూపాయలు) ఆర్థిక సాయం అందించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మూడ సువర్ణ, మాదారం గణేష్ గౌడ్, కేశని మహేష్, మూడ అశోక్, బుచ్చయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.