హైదరాబాద్, డిసెంబర్ 8 : వంశీ రామ్ బిల్డర్స్ ఇళ్లు, కార్యాలయాలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంలో డిజిటల్ లాకర్లలో అధికారులు 220 కేజీల బంగారాన్ని గుర్తించారు. అలాగే కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారానికి సంబంధించిన పత్రాలను సైతం గుర్తించారు. స్థిరాస్తుల పత్రాలతో పాటు పలు వ్యాపార భాగస్వాముల డాక్యుమెంట్లను గుర్తించి వాటిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.