‘‘కంటి పరీక్షలు చేయించుకునేందుకు నగరాలు, పట్టణాలకు, ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జనావాసాల వద్ద కంటి వెలుగు శిబిరాలు నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు క్యాంపులకు యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.’’
- 6,93,644 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీ కోసం రెఫర్
- రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల 85 వేల 071 మందికి కంటి పరీక్షల నిర్వహణ……
- 9 లక్షల 93 వేల 461 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ…….
- ఉచిత పరీక్షలతో ప్రజలకు తప్పుతున్న కంటి ఇబ్బందులు…
- జిల్లా కలెక్టర్ ల పర్యవేక్షణలో ముమ్మరంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శ్రీవాణి డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపుకు వచ్చిన కళషికం అనిత తన అభిప్రాయం తెలుపుతూ…
తనకు 40 సంవత్సరాలు అని, చూపు మసగ్గా, స్పష్టంగా లేనందున, సీఎం కేసీఆర్ సార్ కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేసారంటే వచ్చి పరీక్షలు చేయించుకున్న, ఇక్కడ డాక్టర్ సార్లు దూరం, దగ్గరి చూపును కండ్లకు పరీక్ష చేసి దగ్గర చూపు తగ్గిందని తెలిపారని, ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కళ్లద్దాలు, మందులు క్యాంప్ లో ఇస్తున్నారని, ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు.షోహన్ బేగం మాట్లాడుతూ, తనకు (56) సంవత్సరాల వయస్సు అని, కంటి పరీక్షలపై అవగాహన లేక, వైద్య పరీక్షలకు వెళ్తే వేల రూపాయల ఖర్చు అవుతుందని భయపడిన మాకు, ఇంటికి పెద్ద కొడుకులాగ సి.ఎం. సార్ ఆలోచన చేస్తూ మేము ఉన్న ప్రాంతాల్లోనే కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తూ కళ్లద్దాలు, మందులు అందించడం చాలా సంతోషంగా ఉందని, సి.ఎం. సార్ చల్లగా ఉండాలని అన్నారు.
చుక్కల మందులు ఇచ్చిండ్రు, అద్దాలు ఇచ్చిండ్రు..!
పెద్దల రమ వృత్తి కూలి , భర్త సాంబయ్య, శ్రీనివాస కాలనీ, ములుగు.నా పేరు పెద్దల రమ. నాకు ముగ్గురు అమ్మాయిలే. కొడుకులు లేరు. పెద్ద బిడ్డ బీటెక్ చదువుతుంది. ఇద్దరు బిడ్డలు తాడువాయి లో ఇంటర్ చదువుతున్నారు. దగ్గర చూపు కనపడకపోయేది కంటి వెలుగు వల్ల కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు అద్దాలు మంచిగా కనబడుతున్నాయి. అద్దాలు పెట్టుకుంటే సూదిల దారం పెడుతున్న… ఈ కంటి వెలుగు మంచిగ అనిపించింది. ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చారు.
నేను బార్బర్ షాపులో పనిచేస్తా. మా ఊరు బండారుపల్లి. నాకు దగ్గర చూపు కనబడకపోయేది. ఇక్కడ కంటి వెలుగు పథకంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు కూడా ఇస్తున్నారని చెప్పడంతో ఇక్కడికి వచ్చా. డాక్టర్లు కంటి పరీక్షలు చేసి, దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడంతో గతంలో కంటే ఇపుడు చూపు స్పష్టంగా కనిపిస్తున్నది.ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది.. !
అచ్చ సాంబయ్య, తండ్రి లక్ష్మయ్య, బంజారా కాలనీ, ములుగు.ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది. ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం చాలా సంతోషం. ప్రైవేటు దవఖానాలో ఐతే శానా పైసలు అయితుండే. ఈ కంటి వెలుగు లో మందులు, అద్దాలు ఉచితంగా ఇచ్చిండ్రు.
మేరా నామ్ హశ్మత్, 53 వయసు గడిగడ్డ, ములుగు.
నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు బిడ్డలు. వాళ్ళ పెళ్లిళ్లు అయిపోయినాయి. నా భార్త చనిపోయాడు. నాకు కంటి సమస్య కొద్ది నెలల నుండి ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోవడానికి డబ్బులు లేక చుపించుకోలేదు. కంటి వెలుగు కార్యక్రమము ప్రభుత్వం చేపట్టినదని చెప్పిండ్రు. ఉచితంగా మందులు ఇచ్చిండ్రు, అద్దాలు ఇచ్చిండ్రు. ఈ సర్కారు చల్లగా ఉండాలే. ఈ పథకంతో మాలాంటి పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
కే. శ్రీనివాస్, వయసు 46 దేవగిరిపట్నం.
కంటి వెలుగు సూపర్. నాకు పేపర్ చదువుతుంటే దగ్గర చూపు ఇబ్బందిగా ఉండేది. కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా అద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు సూపర్ గా కనబడుతున్నాయి. కేసీఆర్ పెట్టిన కంటి వెలుగు పథకంతో కొత్తచూపు వచ్చినట్లు ఉంది. ఇంకా ఇలాంటి పథకాలు కెసిఆర్ సారు మరెన్నో చేపట్టాలి.
హైమావతి వయసు 45 గొల్లవాడ ములుగు
నాకు కంటి వెలుగు కొత్త చూపునిస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. కేసిఆర్ సారు కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే. ఏం డోకా లేదు ఇలలోని అందాలను మేము చూడగలం. పేదల కళ్ళలో అద్దాలు ఒక వరం.కంటి వెలుగు కార్యక్రమము తో దురమౌతున్న కంటి సమస్యలు. జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ కంటి వెలుగు కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రజలమాట ఇక ఏం డోకా లేదు.
– కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.