మున్సిపల్‌ ‌సిబ్బందిది థాంక్‌లెస్‌ ‌జాబ్‌

  • ‌వారి సేవలను గుర్తించాలి
  • గొడ్డు చాకిరీ చేసినా విమర్శలే తప్ప ప్రశంసలు ఉండవు
  • ఒక్క రోజు పనిచేయకపోతే ఫోన్ల వి•ద ఫోన్లు
  • రాష్ట్రంలో 46 శాతం జనాభా పట్టణాల్లోనే..
  • పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌
  • ‌హెల్త్ ‌కేర్‌ 3‌డీ ప్రింటింగ్‌ ‌రంగంలో అగ్రగామిగా తెలంగాణ : 3డీ ప్రింటింగ్‌పై జాతీయ సదస్సులో కేటీఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : మున్సిపల్‌ ‌జాబ్‌ ‌థ్యాంక్‌ ‌లెస్‌ ‌జాబ్‌ అని మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతపనిచేసినా ఇంకా చేయలేదన్న విమర్శలు తప్ప ప్రశంసలు ఉండవని అన్నారు. మున్సిపల్‌ ‌సిబ్బంది చేస్తున్నంత గొడ్డు చాకిరి రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఇతర డిపార్ట్‌మెంట్‌ ‌కూడా చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. వి•రు ప్రతి రోజు ఊరుని శుభ్రంగా ఉంచినా ఎవరూ మిమ్మల్ని అభినందించారు. ఒక వేళ వారం రోజుల పాటు బంద్‌ ‌పెడితే.. కౌన్సిలర్‌ ‌నుంచి మంత్రి దాకా ఫోన్లు చేసి తిడుతారు. ఎందుకంటే ఈ జాబ్‌ ‌థ్యాంక్‌ ‌లెస్‌ ‌జాబ్‌ అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి అవగాహన సదస్సులో కేటీఆర్‌ ‌పాల్గొని మాట్లాడుతూ..మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్ల కంటే మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు కష్టపడుతున్నారు.. అలాంటి వారిని అందరం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలోని మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిపై ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 68 మున్సిపాలిటీలు మాత్రమే ఉండే. ఇప్పుడు కొత్తగా 74 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నాం. దీంతో మున్సిపాలిటీల సంఖ్య 142కు చేరిందన్నారు. ‘అన్ని మున్సిపాలిటీల్లో నిర్విరామంగా మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది అందరూ పని చేస్తున్నారు. మున్సిపల్‌ ‌సిబ్బంది పని చేయట్లేదంటే నేను ఒప్పుకోను. చాలా మున్సిపాలిటీలను అప్‌ ‌గ్రేడ్‌ ‌చేశాం.. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం. కానీ మున్సిపల్‌ ‌శాఖకు అదనపు సిబ్బందిని ఇవ్వలేదు. కొత్త మున్సిపల్‌ ‌కమిషనర్లను కూడా రిక్రూట్‌ ‌చేయలేదు.. ఇప్పుడు రిక్రూట్‌ ‌చేస్తున్నాం. ఉన్న సిబ్బందితోనే పట్టణ ప్రగతి అమలు చేసి ఉరుకులు పరుగులు పెట్టించి పని చేయించాం. 24 గంటల పాటు వారు కష్టపడుతున్నారు. వారిని అభినందించాలని కౌన్సిలర్లకు, చైర్మన్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. వి•రు కష్టపడుతలేరని నేను అనడం లేదు..కానీ వి• కంటే ఎక్కువగా మున్సిపల్‌ ‌సిబ్బంది కష్టపడుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డాం. వారు గవర్నమెంట్‌ ‌సర్వీస్‌ ‌నుంచి వొచ్చినవారు.

వారిని గౌరవించాలి’ అని కేటీఆర్‌ ‌సూచించారు. తెలంగాణలో 46 శాతం పట్టణీకరణ పెరిగిందని కేటీఆర్‌ ‌తెలిపారు. రాబోయే 5 నుంచి ఏడేండ్లలో మెజార్టీ ప్రజలు 51 శాతం పట్టణాల్లోనే నివసించబోతున్నారు. ఇండియా గ్రామాల్లో నివసిస్తుందని గాంధీ అన్న మాట చాలా మేరకు వాస్తవమైంది. 75 శాతం భారతదేశం గ్రామాల్లోనే ఉంది. కానీ తెలంగాణలో 46 శాతం జనాభా పట్టణాల్లో ఉందన్నారు. భారతదేశ ఎకానవి• ముందుకుపోతుందంటే అందుకు పట్టణాలే ప్రధాన కారణమని కేటీఆర్‌ ‌తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీ 2014లో 5 లక్షల 6 వేల కోట్లు.. ఈ ఏడేండ్లలో అన్ని రంగాల్లో బహుముఖంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు జీఎస్డీపీ 11 లక్షల 55 వేల కోట్లకు చేరింది. సింహాభాగం జీఎస్డీపీ పట్టణాల నుంచే వస్తోంది. హైదరాబాద్‌ ‌నుంచి 45 శాతం జీఎస్డీపీ వస్తోంది. మిగతా మున్సిపాలిటీలు, పట్టణాల నుంచి మరో 20 శాతం జీఎస్డీపీ వస్తోంది. పట్టణాలు ప్రధాన ఆర్థిక వనరుగా మారాయి. గత ఐదు వేల సంవత్సరాలు జరిగిన పట్టణీకరణ.. రాబోయే ఐదేండ్లలో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఉపాధి, మెరుగైన వైద్య, విద్య కోసం పట్టణాలకు వస్తున్నారు. మన పిల్లల భవిష్యత్‌, ‌జీవన ప్రమాణాలు పెరగాలని ప్రతి పేరెంట్‌ ‌కోరుకుంటాడు. అందుకు పట్టణాలకు రావడం సహజం అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం.. 1 లక్ష 12 వేల పైచిలుకు చదరపు కిలోవి•టర్లు. అందులో హైదరాబాద్‌ను తీసుకుంటే 675 చదరపు కిలోవి•టర్లు మాత్రమే.

ఇక్కడే కోటి 20 లక్షల మంది ఉన్నారు. ఉదాహరణకు కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకుంటే.. అక్కడ 4 లక్షల జనాభా ఉన్నది అనుకుంటే.. కామారెడ్డి పట్టణంలోనే లక్ష మంది ఉంటారు. ఈ క్రమంలో పట్టణాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటన్నింటిని అధిగమించాలంటే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. జనసాంద్రతకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణాలను మంచిగా అభివృద్ధి చేసి భవిష్యత్‌ ‌తరాలకు అందించాలని కేటీఆర్‌ ‌సూచించారు.

హెల్త్ ‌కేర్‌ 3‌డీ ప్రింటింగ్‌ ‌రంగంలో అగ్రగామిగా తెలంగాణ : 3డీ ప్రింటింగ్‌పై జాతీయ సదస్సులో కేటీఆర్‌

‌హెల్త్ ‌కేర్‌ 3‌డీ ప్రింటింగ్‌ ‌రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఇప్పటికే టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్‌ ‌ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. టీ వర్కస్ ‌ద్వారా అనేక ప్రోటో టైప్స్ ‌రూపొందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ ‌హెచ్‌ఐసీసీలో మెడికల్‌ ‌డివైజెస్‌, ఇం‌ప్లాంట్స్‌లో 3డీ ప్రింటింగ్‌పై జరిగిన జాతీయ సదస్సులో కేటీఆర్‌ ‌పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌సమక్షంలో వివిధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. అనంతరం కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. నవ్య సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపే లక్ష్యంలో భాగంగా 3డీ ప్రింటింగ్‌పై దృష్టి సారించామన్నారు. 3డీ ప్రింటింగ్‌ ‌ద్వారా సర్జన్లు, రోగులకు వైద్య సేవలను మరింత మెరుగుపరిచే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఆర్థికంగా హెల్త్ ‌కేర్‌ 3‌డీ ప్రింటింగ్‌ ‌మార్కెట్‌ ‌విలువ 2020లో 1.7 బిలియన్‌ ‌డాలర్లుగా ఉందన్నారు. 2027 నాటికి ఇది 7.1 బిలియన్లకు చేరుతుందని అంచనా వేశారు. ఆర్థోపెడిక్‌, ‌డెంటల్‌తో పాటు పలు విభాగాల రోగుల్లో ఇంప్లాంట్లకు డిమాండ్‌ ‌పెరగడం ఈ రంగం అభివృద్ధికి ప్రధాన కారణం అని చెప్పారు. ప్రస్తుతం ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భారత్‌కు చక్కటి అవకాశ ముందన్నారు. యూఎస్‌, ‌యూరోపియన్‌ ‌మార్కెట్లలో ఇప్పటికే ఈ సాంకేతికత దూసుకుపోతుందన్నారు. ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ అడిట్‌ ‌మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌సెంటర్‌తో ఈ రంగంలో దేశం పురోగతి సాధిస్తుందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *