Take a fresh look at your lifestyle.

మిల్లెట్‌ ‌మ్యాన్‌ ‌సతీష్‌కు కన్నీటి వీడ్కోలు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 20 : డెక్కన్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌సొసైటీ డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌పి వి సతీష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్త తెలియగానే జహీరాబాద్‌ ‌ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. పట్టణ పరిధిలోని పస్తపూర్‌లోని దక్కన్‌ ‌డెవలప్‌ ‌సొసైటీ డైరెక్టర్‌ ‌పీవీ సతీష్‌ (78) ‌సం రాలు, గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో మహానగరంలోని ఒక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే, వీరి అంత్యక్రియల్లో పస్తపూర్‌ ‌గ్రామంలోని డీడీస్‌ ‌వ్యవసాయ క్షేత్రంలో సోమవారం మధ్యాహ్నం జరిగాయి.

వీరి నేపథ్యం 1945 సంవత్సరంలో జూన్‌ 18 ‌నాడు కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌ ‌ప్రాంతంలో వెంకట సుబ్బయ్య దంపతులకు జన్మించారు, సతీష్‌  ‌విద్యాభ్యాసం మైసూర్‌ ‌కర్ణాటక రాష్ట్రంలో సాగింది, మాస్‌ ‌కమ్యూనికేషన్‌లో సతీష్‌కి బంగారు మెడల్‌ ‌దక్కింది. వీరు అనేక అంశాలలో నిష్ణాతులు, దేశంలో ప్రఖ్యాతి గాంచిన దూరదర్శన్‌ ‌టెలివిజన్‌లో అనేక హోదాల్లో పనిచేశారు, తదుపరి వలంటరీ రిటైర్మెంట్‌ ‌తీసుకుని మహిళల అభ్యున్నతి కోసం సహాయ సహకారాలు అందించి మహిళ ఉద్యోగిత, మహిళ సాధికారికతకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో జహీరాబాద్‌ ‌మండలంలోని పస్తపూర్‌ ‌గ్రామాన్ని దత్తత తీసుకొని దక్కన్‌ ‌డేవాలమెంట్‌ ‌సొసైటీని ప్రారంభించి, దేశంలో ఎక్కడా లేకుండా మన జహీరాబాద్‌ ‌ప్రాంతం నుంచే మిల్లెట్‌(‌చిరు ధాన్యాలు) ఉద్యమాన్ని ప్రారంభించి చిరుధాన్యాలకు కేరాఫ్‌ ‌డీడీఎస్‌ అనే స్థాయికి తీసుకువచ్చిన ఘనత డీడీఎస్‌ ‌డైరెక్టర్‌ ‌సతీష్‌కు దక్కింది, అదేవిధంగా 2023 సం రాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో డీడీఎస్‌ ‌వ్యవస్థాపకులు సతీష్‌ అకాల మరణం చెందడం మింగుడు పడని విషయమే. ఆయన అంత్యక్రియల్లో 72 గ్రామాల మహిళ ప్రతినిధులు, డీడీఎస్‌ ‌సభ్యులు హాజరయ్యారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply