Take a fresh look at your lifestyle.

మార్చి 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’

  • మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నూతన కార్యక్రమం
  • సిపీఆర్‌ ‌పై నిర్దేశిత వర్గాలకు శిక్షణ పూర్తి చేయాలి
  • జిల్లా స్థాయి వైద్య, పంచాయితీ, మున్సిపల్‌, ‌పోలీసు శాఖల సిబ్బంది పర్యవేక్షించాలి
  • ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర,మార్చి 4: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ‘‘ఆరోగ్య మ హిళ’’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది.. అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8 న ప్రారంభించే అరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతం చేయాలని  ఆర్థిక, వైద్యారోగ్య శాఖ  మంత్రి హరీశ్‌ ‌రావు సంబంధిత అధికా రులకు, సిబ్బందికి సూచి ంచారు.    శనివారం  బీఆర్కే భవన్‌ ‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ..మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి  సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది..మహిళలు  ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలకి వైద్యం అందిస్తుంది..ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా దీన్ని అందిస్తున్నది. .
ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభిస్తాం..అని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు.మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, మొత్తం 1200 లకు విస్తరించాలని ఆలోచన..ఉందని పేర్కొంటూ 1, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు,2, ఓరల్‌, ‌సర్వైకల్‌, ‌రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్‌.. 3, ‌థైరాయిడ్‌ ‌పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్‌ ‌సమస్య, ఫోలిక్‌ ‌యాసిడ్‌, ఐరన్‌ ‌లోపంతో పాటు, విటమిన్‌ ‌బీ12, విటమిన్‌ ‌డి పరీక్షలు చేసి చికిత్స, మందులు ..4, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్‌ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు 5, మెనోపాజ్‌ ‌దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్‌ ‌రీప్లేస్మెంట్‌ ‌థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌ ‌తో అవగాహన .6, నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం ,. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన , అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్‌ ‌పరీక్షలు .7, సెక్స్ ‌సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన.. అవసరమైన వారికి వైద్యం  8, బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు. అని మంత్రి తెలిపారు.ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక యాప్‌ ‌ద్వారా మానిటరింగ్‌ ఉం‌టుంది..అని పేర్కొంటూ తెలంగాణ డయాగ్నొస్టిక్‌ ‌ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు..
మొదటి విడతలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, మొత్తంగా 1200 పీ హెచ్‌ ‌సి, యూపిహెచ్సి, బస్తి దావాఖన లో.అన్ని జిల్లాల్లో విజవంతంగా నిర్వహించాలి. ఈ ప్రత్యేక సేవల గురించి అవగాహన కల్పించాలి..అని సూచించారు. సిపిఆర్‌, ‌కంటి వెలుగు, కాంప్రహెన్సివ్‌ ‌విమెన్‌ ‌హెల్త్ ‌ప్రోగ్రాం పై అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఎంహెచ్వోలు, ఎస్పీలు, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులతో మంత్రి హరీష్‌ ‌రావు  వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.  ఈ సమీక్షా సమావేశంలో   పంచాయతీరాజ్‌, ‌గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు ,సీఎస్‌ ‌శాంతి కుమారి, హెల్త్ ‌సెక్రెటరీ రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ ‌మిట్టల్‌, ‌పంచాయతీరాజ్‌, ‌గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ‌శ్వేత మహంతి,సీఎం ఓఎస్డీ గంగాధర్‌, ‌డైరెక్టర్‌ ‌పిఆర్‌ ‌హన్మంత రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
9 మంది చిన్నారులకు ప్రాణదానం
గుండె చికిత్సలు చేసిన విదేశీ వైద్య బృందం
వైద్యులను అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు
image.pngహైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: నిమ్స్,‌నిలోఫర్‌ ‌హాస్పిటల్‌ ‌లో పసి పిల్లలకు హార్ట్ ‌సర్జరీలు నిర్వహించి, వారి ప్రాణాలను కాపాడిన బ్రిటన్‌ ‌వైద్య బృందానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిమ్స్ ‌హాస్పిటల్‌ ‌లో  యూకే వైద్యులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పసి హృదయాలను కాపాడేందుకు, తమ ఆహ్వానం మేరకు నిమ్స్ ‌హాస్పిటల్‌  ‌కి వచ్చిన బ్రిటన్‌ ‌వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్‌ ‌వెంకటరమణ దన్నపనేని తమ బృందంతో వచ్చి నిలోఫర్‌, ‌నిమ్స్ ‌వైద్యులకు సహకారం అందించారు. అందరూ కలిసి 9 మంచి చిన్నారులకు సర్జరీలు నిర్వహించారు. ఎక్మో ద ఉన్న చిన్నారికి కూడా సర్జరీ చేయడం గొప్ప విషయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒక్కో సర్జరీని 20 మందితో కూడిన వైద్య బృందం 4-5 గంటల పాటు చేశారు. 9 మంది ప్రాణాలు కాపాడారని హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా నిమ్స్ ఇం‌చార్జి డైరెక్టర్‌ ‌బీరప్పకు, నిలోఫర్‌ ‌సూపరింటెండెంట్‌ ఉషారాణికి, సర్జరీలో భాగస్వా ములైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పారు.
పుట్టిన రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేయాలని వచ్చిన డాక్టర్‌ ‌రమణకు ప్రత్యేక అభినందనలు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు పుట్టిన గడ్డకు మేలు చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. విదేశీ నిపుణులను తీసుకొచ్చి ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు చేసిన సందర్భం దిల్లీ  ఎయిమ్స్ ‌తర్వాత ప్రభుత్వ నిమ్స్ ‌లోనే జరిగిందని హరీశ్‌ ‌రావు గుర్తు చేశారు. చిన్న పిల్లలకు గుండె సర్జరీ చేయడం అనేది అత్యంత క్లిష్టమైన, ఖరీదైన వైద్యం అని మంత్రి పేర్కొన్నారు. దీనికోసం ప్రైవేటులో లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మన నిమ్స్ ‌లో ఈ 9 మంది చిన్నారులకు పూర్తి ఉచితంగా సర్జరీలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
తనకు ఈ రోజు ఎంతో సంతోషంగా అనిపించింది. సర్జరీ తర్వాత ఆ పిల్లలు నవ్వుతుంటే మనసు నిండిపోయిందని హరీశ్‌ ‌రావు తెలిపారు. తెలంగాణ లో ప్రతి సంవత్సరం 6 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. వీరిలో 5,400 మంది పిల్లలకు గుండె జబ్బులు ఉంటున్నాయి. వారిలో 1000 మందికి శస్త్ర చికిత్స అవసరం అవుతుందన్నారు. కార్పొరేట్‌కి వెళ్ళలేక, సరైన సమయంలో వైద్యం అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, తెలంగాణ ప్రభుత్వం మానవీయకోణంలో అలోచించి వీరికి శస్త్ర చికిత్సల కొరకు ప్రభుత్వ దవాఖానాల్లో  మౌళిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు.

Leave a Reply